Guardian OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హారర్ మూవీ.. గార్డియన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ ఈ మధ్యన సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. మహా, పార్ట నర్, మై నేమ్ ఈజ్ శ్రుతి, 105 మినిట్స్ సినిమాలన్నీ ఈ జానర్లకు సంబంధించినవే. ఇదే కోవలో హన్సిక నటించిన మరో హార్రర్ థ్రిల్లర్ సినిమా గార్డియన్. శబ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ తెరకెక్కించిన ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.

Guardian OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హారర్ మూవీ.. గార్డియన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Hansika Motwani

Updated on: May 03, 2024 | 5:51 PM

టాలీవుడ్ యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ ఈ మధ్యన సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. మహా, పార్ట నర్, మై నేమ్ ఈజ్ శ్రుతి, 105 మినిట్స్ సినిమాలన్నీ ఈ జానర్లకు సంబంధించినవే. ఇదే కోవలో హన్సిక నటించిన మరో హార్రర్ థ్రిల్లర్ సినిమా గార్డియన్. శబ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ తెరకెక్కించిన ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైన గార్డియన్ మూవీ జనాలకు పెద్దగా ఎక్కలేదు. రిలీజైన కొన్ని రోజులకే థియేటర్ల నుంచి మాయమైపోయింది. హ‌న్సిక నటన మిన‌హా క‌థ‌, క‌థ‌నాలు, హార‌ర్ ఎలిమెంట్స్, కామెడీ రోటీన్ గా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. ఇలా థియేటర్లలో ఆడియెన్స్ ను నిరాశ పర్చిన గార్డియన్ మూవీ సడెన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రస్తుతం గార్డియన్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సింప్లీసౌత్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఓవ‌ర్‌సీస్‌ ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇండియాలోని సినీ ఆడియెన్స్ కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హన్సిక మూవీ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ హార్రర్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

ఇక సినిమా కథ విషయానికి వస్తే..

అప‌ర్ణ (హ‌న్సిక‌) ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన అప‌ర్ణ జీవితం ఊహించిన మ‌లుపులు తీసుకుంటుంది. ఆమెను ఓ ఆత్మ ఆవ‌హిస్తుంది. అంతేకాదు అప‌ర్ణ శరీరం స‌హాయంతో నగరంలో పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి అవుతోన్న వారిపై ఆత్మ ప్ర‌తీకారం తీర్చుకుంటుంది? మరి ఇంతకీ అస‌లు ఆ ఆత్మ ఎవ‌రు? అప‌ర్ణ శ‌రీరంలోకి ఆ ఆత్మ ఎందుకు ప్ర‌వేశించింది?చివరకు ఏమయ్యిందో తెలుసుకోవాలంటే గార్డియన్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

త్వరలోనే తెలుగులోకి కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.