Prabhas: ఆ విషయంలో గోపిచంద్ వెనక ప్రభాస్ ఉన్నాడట.. తన స్నేహితుడికి డార్లింగ్ ఇచ్చిన సలహా ఏంటంటే..

|

Jan 07, 2023 | 8:02 AM

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు.. రాజకీయ ప్రముఖులు విచ్చేసిన నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలోకి ప్రభాస్..గోపిచంద్ వచ్చి సందడి చేశారు. ఎప్పుడూ ఇంటర్వ్యూలలో సైలెంట్ గా ఉండే డార్లింగ్.. మొదటిసారి ఈ వేదికపై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎంతో సరదాగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తమ హీరోను అంత సంతోషంగా చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

Prabhas: ఆ విషయంలో గోపిచంద్ వెనక ప్రభాస్ ఉన్నాడట.. తన స్నేహితుడికి డార్లింగ్ ఇచ్చిన సలహా ఏంటంటే..
Gopichand, Prabhas
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తన ప్రాణ స్నేహితుడు హీరో గోపిచంద్‏తో కలిసి మొదటి ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు.. రాజకీయ ప్రముఖులు విచ్చేసిన ఈ షోలోకి ప్రభాస్..గోపిచంద్ వచ్చి సందడి చేశారు. ఎప్పుడూ ఇంటర్వ్యూలలో సైలెంట్ గా ఉండే డార్లింగ్.. మొదటిసారి ఈ వేదికపై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎంతో సరదాగా ఉన్నారు. చాలా కాలం తర్వాత తమ హీరోను అంత సంతోషంగా చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక వీరికి సంబంధించిన వీడియోస్ ను రెండు ఎపిసోడ్స్ గా రిలీజ్ చేసింది ఆహా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఇందులో గోపిచంద్, ప్రభాస్ మధ్య ఉన్న అనుబంధం.. వారిద్దరి స్నేహం ఎలా ఉంటుందనేది తెలుస్తోంది. అయితే తనకు గతంలో ప్రభాస్ ఇచ్చిన సలహాల గురించి చెప్పుకొచ్చాడు గోపిచంద్.

ఈ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడుతూ.. తనకు గోపిచంద్ నటించిన జిల్ సినిమా చాలా నచ్చిందని.. ఇప్పటివరకు తాను మూడుసార్లు చూశానని చెప్పుకొచ్చారు. అందులో హీరో ట్రెండీ మేకోవర్ తనకు బాగా నచ్చిందని చెప్పారు బాలయ్య. అయితే తన రూపాంతరం వెనక ప్రభాస్ ఉన్నాడని అసలు విషయం బయటపెట్టారు గోపిచంద్.

ఇవి కూడా చదవండి

జిల్ సినిమా.. తన మేకోవర్ విషయంలో పూర్తి క్రెడిట్ డార్లింగ్ దే అని గోపిచంద్ వెల్లడించారు. రొటీన్ లుక్స్ తో తనను చూసి గెటప్ మార్చుకోమని సలహా ఇచ్చాడట. జిల్ సినిమాలో గోపిచంద్ ఫ్యాన్సీగా, స్టైలీష్ గా కనిపించారని.. అలాగే మెయింటెయిన్ చేయమని బాలకృష్ణ కోరారు. డిఫరెంట్ గా జిల్ సినిమా చేయమని ప్రభాస్ చెప్పాడని గోపిచంద్ తెలిపారు. అలాగే ఈ ఎపిసోడ్ లో తన పెద్దనాన్న కృష్ణంరాజును తలుచుకుని ఎమోషనల్ అయ్యారు ప్రభాస్.