The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ‘ది కేరళ స్టోరీ’.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?

|

Feb 16, 2024 | 9:50 AM

ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఎట్టకేలకు కాంట్రవర్సీ మూవీ ది కేరళ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల మే5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సుమారు 9 నెలల తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శుక్రవారం (ఫిబ్రవరి 16) అర్ధరాత్రి నుంచి ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ కాంట్రవర్సీ మూవీ అందుబాటులో ఉంది.

The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ది కేరళ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?
The Kerala Story Movie
Follow us on

ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఎట్టకేలకు కాంట్రవర్సీ మూవీ ది కేరళ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల మే5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సుమారు 9 నెలల తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శుక్రవారం (ఫిబ్రవరి 16) అర్ధరాత్రి నుంచి ది కేరళ స్టోరీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ కాంట్రవర్సీ మూవీ అందుబాటులో ఉంది. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించాడు. హార్ట్‌ ఎటాక్‌ బ్యూటీ అదాశర్మ కీలక పాత్ర పోషించింది. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ మూవీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈమూవీపై నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇలా వివాదాల్లో నిలిచే ఓవరాల్ గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ది కేరళ స్టోరీ. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా? అని జనాలు ఎదురుచూడసాగారు. అయితే ఎట్టకేలకు ఈ నిరీక్షణకు ఎండ్‌ కార్డ్‌ పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఎట్టకేలకు శుక్రవారం (అర్ధరాత్రి) నుంచి అదాశర్మ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

ఇవి కూడా చదవండి

ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లో చేరడం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో రిలీజైన సమయంలో వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలో ఎలా రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

 

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.