Nunakkuzhi OTT : హాయిగా నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..

|

Sep 07, 2024 | 4:07 PM

ఆగస్ట్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలను అందుకుంది. అయితే అదే సమయంలో మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో ఈ చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది..

Nunakkuzhi OTT : హాయిగా నవ్వుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
Nunakuzhi
Follow us on

కొన్నాళ్లుగా ఓటీటీలలో హారర్, మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ తరహా కంటెంట్ చిత్రాలు చూసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే క్రైమ్ కామెడీ చిత్రాలు కూడా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. అందులో నునాకుజి ఒకటి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దృశ్యం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ నటించాడు. ఆగస్ట్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలను అందుకుంది. అయితే అదే సమయంలో మలయాళం ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో ఈ చిత్రం ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది.. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఈ చిత్రం ఓటీటీ హక్కులను జీ గ్రూప్ సొంతం చేసుకుంది. డిజిటల్‌తో పాటు ఈ సినిమా శాటిలైట్ హక్కులను కూడా జీ గ్రూప్ సొంతం చేసుకుంది. ఓనం పండగ కానుకగా సెప్టెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ తోపాటు గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్ధిఖీ ప్రధాన పాత్రలలో నటించగా.. కేవలం పది కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక సెప్టెంబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ భాషలలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సరిగమ, బెడ్‌టైమ్ స్టోరీస్, యూడ్లీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్ నిర్మించారు.

భార్యతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోను తన సొంత ల్యాప్ టాప్‏ను ఎలాగైనా ఐటీ అధికారుల నుంచి కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు హీరో. ఆ క్రమంలోనే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? ఎలాంటి చిక్కులను ఎదుర్కోన్నాడు అనేది సినిమా. సిట్యూవేషనల్ కామెడీ, సర్ ప్రైజింగ్ ట్విస్టులతో ఈ చిత్రాన్ని ఆద్యంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కించారు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో ఆద్యంతం ఊత్కంఠతో కూడిన ట్విస్టులతో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లిన జీతూ జోసెఫ్.. ఇప్పుడు క్రైమ్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.