OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ట్రంప్ బయోపిక్.. బ్యాన్ అయిన ఈ కాంట్రవర్సీ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై చాలా వివాదాలు తలెత్తాయి. అయినా ఎలాగోలా థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. అయితే ఓటీటీలో రాకుండా మాత్రం బ్యాన్ చేశారు.. కానీ ఇప్పుడు..

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ట్రంప్ బయోపిక్.. బ్యాన్ అయిన ఈ కాంట్రవర్సీ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Donald Trump Biopic

Updated on: Oct 30, 2025 | 9:40 PM

ఈ మధ్యన బయోపిక్ లు, రియల్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో జనాలు ఈ సినిమాలు, సిరీస్ లను ఎగబడి చూస్తున్నరు. అలా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ వచ్చింది. 2018లో ఈ బయోపిక్ ను అనౌన్స్ చేశారు. 2023లో కానీ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు 2024 మే 20న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ తర్వాత 2024 అక్టోబర్ 11న థియేటర్లలోకి ఈ సినిమాను రిలీజ్ చేశారు. 1970, 1980లలో న్యూయార్క్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ట్రంప్ ఎలా ఎదిగారు? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అధికారంలోకి వచ్చాక ట్రంప్ చేపట్టిన సంస్కరణలేంటి? అనే అంశాలను ఇందులో ప్రధానంగా చూపించారు. అలాగే కొన్ని వివాదాస్పద విషయాలను కూడా టచ్ చేశారు. అందుకే ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ కు నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. డొనాల్డ్ ట్రంప్ తండ్రి తన ఫ్రెండ్‌తో కలిసి పెద్ద పెద్ద భవనాలు కడతాడు. అయితే నల్ల వాళ్లకు ఇళ్ళు అమ్మకపోవడంతో కేసు నమోదవుతుంది. ట్రంప్ తండ్రి ఇతర కుటుంబ సభ్యులు ఎలాగోలా ఈ కేసును క్లోజ్ చేయిస్తారు. కానీ ట్రంప్ కలలు మరోలాఉంటాయి. మానహాట్టన్‌లో భారీ హోటల్ కట్టాలనుకుంటాడు.
ఇందుకోసం బ్యాంకులు, పెద్దవాళ్లతో మాట్లాడుతాడు. కానీ డబ్బు చేతికందదు. అదే సమయంలో రాయ్ కోన్ అనే వ్యక్తి ట్రంప్ జీవితంలోకి వస్తాడు. అతని సాయంతో ట్రంప్ పెద్ద పెద్ద డీల్స్ చేస్తాడు.

తాను కలలు కన్నట్లే పెద్ద హోటల కడతాడు. అదే సమయంలో ఇవానాను లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాత ట్రంప్ మారిపోతాడు. ఇవానాతో గొడవలు మొదలవుతాయి. ఒక సన్నివేశంలో ట్రంప్ ఇవానాను బలవంతం చేసినట్లు ఈ సినిమాలో చూపిస్తారు. ఇదే కాంట్రవర్సీకి దరి తీసింది. ఆ తర్వాత ట్రంప్ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? ఏం జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ది అప్రెంటీస్. అలీ అబ్బాసి తెరకెక్కించిన ఈ బయోపిక్ లో డోనాల్డ్ ట్రంప్‌గా సెబాస్టియన్ స్టాన్ నటించాడు. ట్రంప్ మొదటి భార్య ఇవానాగా మరియా బకలోవా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా లయన్స్‌గేట్ ప్లే, OTTplay లలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.