
సినిమాలో ఎంత మంది స్టార్స్ ఉన్నా, వీఎఫ్ క్స్ హంగులు భారీగా ఉన్నా, యాక్షన్ సీక్వెన్సులు, స్పెషల్ సాంగులు దట్టించినా ఫైనల్ గా కంటెంట్ ఉంటేనే సినిమా నిలబడుతుంది. ఇప్పటికే ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఓ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమానే. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ లేదు. పైగా స్టార్ క్యాస్టింగ్ కూడా పెద్దగా లేదు. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. చడీ చప్పుడు లేకుండానే థియేటర్లలోకి అడుగు పెట్టింది. అంతే సంచలనాలు మొదలయ్యాయి. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది. వంద కోట్లు, 200, 300 కోట్లు.. ఇలా చివరకు 800 కోట్లు సాధించి భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం రూ. 15 కోట్లు మాత్రమే. ఈ సినిమా కథ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. కథ విషయానికి వస్తే.. పురుషాధిపత్యం, ఇంట్లో హింస ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒక అమ్మాయి సింగర్ గా ఎదగాలనుకుంటుంది. అందుకోసం బురఖా వేసుకుని తన పాటల్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయి తన కలను సాకారం ఎలా సాకారం చేసుకుంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలోని బలమైన మెసేజ్, ఎమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను కదిలించాయి. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. అ సినిమా పేరు సీక్రెట్ సూపర్ స్టార్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాలో జైరా వసీమ్ కీలక పాత్ర పోషించింది. అలాగే ఆమిర్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. 2017లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Forget about #Saiyaara #SecretSuperstar is still the highest grossing indian film worldwide in Musical drama Genre.
Budget 25cr
Box office:- 950 crores (WW)
No love story, No intimate scenes, pure emotions with Breaking Stereotypes.
Cinema we want @AKPPL_Official pic.twitter.com/dR6Jeli0q5
— DAHAA 💥 (@AamirAdmirer) July 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..