Month of Madhu OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఆహాలో కలర్స్‌ స్వాతి ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చాలా రోజుల తర్వాత కలర్స్‌ స్వాతి హీరోయిన్‌గా నటించిన చిత్రం మంత్‌ ఆఫ్‌ మధు. నవీన్‌ చంద్ర మరో కీలక పాత్ర పోషించాడు. గతంలో ఇదే నవీన్‌ చంద్రతో కలిసి భానుమతి రామకృష్ణ అనే ఫీల్‌ గుడ్ సినిమాను తీసిన శ్రీకాంత్‌ నగోతి మంత్‌ ఆఫ్‌ మధును తెరకెక్కించారు. మంజులా ఘట్టమనేని,  శ్రేయ నావిలే, హర్ష చెముడు, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు

Month of Madhu OTT: ఇట్స్‌ అఫీషియల్‌.. ఆహాలో కలర్స్‌ స్వాతి మంత్‌ ఆఫ్‌ మధు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Month Of Madhu Movie

Updated on: Oct 31, 2023 | 10:25 AM

చాలా రోజుల తర్వాత కలర్స్‌ స్వాతి హీరోయిన్‌గా నటించిన చిత్రం మంత్‌ ఆఫ్‌ మధు. నవీన్‌ చంద్ర మరో కీలక పాత్ర పోషించాడు. గతంలో ఇదే నవీన్‌ చంద్రతో కలిసి భానుమతి రామకృష్ణ అనే ఫీల్‌ గుడ్ సినిమాను తీసిన శ్రీకాంత్‌ నగోతి మంత్‌ ఆఫ్‌ మధును తెరకెక్కించారు. మంజులా ఘట్టమనేని,  శ్రేయ నావిలే, హర్ష చెముడు, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చాలా రోజుల తర్వాత స్వాతి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించడం, పోస్టర్స్‌, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు  మంత్‌ ఆఫ్‌ మధు సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే అక్టోబర్‌ 6 న థియేటర్లలో విడుదలైన ఈ ఎమోషనల్‌ లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. స్వాతి, నవీన్‌ చంద్రల నటన బాగుందని ప్రశంసలు వచ్చినా కమర్షియల్‌గా మంత్‌ ఆఫ్‌ మధు సక్సెస్‌గా విజయం సాధించలేకపోయింది. థియేటర్లలో పెద్దగా అలరించని మంత్‌ ఆఫ్‌ మధు సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా ఈ ఎమోషనల్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మంత్‌ ఆఫ్‌ మధు సినిమాను నవంబర్‌ 3 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆహా.

కృషివ్‌ ప్రొడక్షన్‌, హ్యాండ్‌ పిక్డ్‌ స్టోరీస్‌ బ్యానర్‌లపై యశ్వంత్ ములుకుట్ల  నిర్మించిన మంత్‌ ఆఫ్‌ మధు సినిమాకు ప్ర‌భుత్వ ఉద్యోగిగా, తాగుబోతుగా న‌వీన్ చంద్ర‌ అద్భుతంగా నటించాడు.  ఇక కాలేజీ అమ్మాయిగా, గృహిణిగా క‌ల‌ర్స్ స్వాతి డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న క్యారెక్ట‌ర్స్‌లో కనిపించి మెప్పించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మ‌ధుసూద‌న్ రావు(న‌వీన్ చంద్ర‌), లేఖ‌(క‌ల‌ర్స్ స్వాతి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే కొన్ని నెలలకే వారి మధ్య మనస్థర్థలు వస్తాయి. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇంతలోపు  మధుమతి (శ్రేయ నవేలి) అమెరికా వస్తుంది. మధు, లేఖలను ఎలా కలిపింది అన్నదే సినిమా కథ. ఎమోషనల్‌ కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాను మిస్‌ అయ్యారా? మరి ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

ఓటీటీ రిలీజ్ పై నవీన్ చంద్ర ఏమన్నారంటే?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..