AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సినిమా రా అయ్యా.! సీన్ సీన్‌కు గుండె జారి ప్యాంట్‌లోకి రావాల్సిందే.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లలో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్ నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వణికించే హారర్ సిరీస్ మళ్లీ వస్తోంది. 1990ల్లో టీవీ ప్రేక్షకులను అలరించిన అనేక హారర్ షోలు మళ్లీ వరుస కడుతున్నాయి.

ఇదెక్కడి సినిమా రా అయ్యా.! సీన్ సీన్‌కు గుండె జారి ప్యాంట్‌లోకి రావాల్సిందే.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..
Horror Movie
Rajeev Rayala
|

Updated on: May 28, 2025 | 6:40 PM

Share

ఓటీటీలు వచ్చాక సినిమాలకంటూ కొదవ లేకుండా పోయింది. అదీ ఏ ఓటీటీలోకి వెళ్లినా.. లెక్కలేనన్ని హారర్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చెప్పబోయే హారర్ సినిమాలో లెక్కలేనన్ని హారర్ సీన్స్ మాత్రమే కాదు బోల్డ్ సీన్స్ కూడా ఉన్న భయంకరమైన మూవీ. ఈ రెండు జోనర్లకు ఫ్యాన్ బేస్ విడివిడిగా ఉంటుంది. కానీ హారర్ సీన్స్.. అలాగే బోల్డ్ సీన్స్ ఉన్న ఈ చిత్రం.. అదిరిపోయే ట్విస్టులతో మిమ్మల్ని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ హారర్ చిత్రాన్ని ఏ ఓటీటీలో చూడొచ్చునంటే.? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

కథ విషయానికొస్తే.. అడవిలో ఒంటరిగా నివాసముంటోంది హీరోయిన్. ఆమె ఇంటి చుట్టుప్రక్కల ఓ ముసలాయన తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇక ఈ హీరోయిన్‌కు వరుసగా పీడకలలు వెంటాడుతుంటాయి. చనిపోయిన భర్తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటున్న హీరోయిన్‌కు.. ఇంట్లో వింత వింత సంఘటనలు ఎదురవుతుంటాయి. నిద్రపోతే చాలు.. కలలో ఏదొక రూపం వచ్చి ఆమెతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటుంది. అలాగే అర్ధరాత్రి చప్పుళ్లు, ఉదయాన్నే లేచి చూస్తే అడుగు జాడలు.. ఇలా ఒకటేమిటి వింత వింత సంఘటనలు చాలానే జరుగుతాయి. ఫ్రెండ్స్‌కి చెప్తే.. హీరోయిన్‌ డిప్రెషన్ కారణంగా ఇలా ఫీల్ అవుతోందని అనుకుంటారు. ఇక అలానే ఓసారి హీరోయిన్ తన ఫ్రెండ్‌ను ఇంటికి పిలుస్తుంది. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఏదో శబ్దం రావడం.. ఆ అమ్మాయి కనిపించకపోవడం.. హీరోయిన్ ముందే నీళ్ళలోకి దూకడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి

ఓ అజ్ఞాత శక్తి హీరోయిన్‌తో మాట్లాడుతుంది.? ఆమెకే కొన్ని పనులు చెబుతుంది. అనూహ్యంగా ఓ అర్ధరాత్రి హీరోయిన్ బోటులో ఉంటే.. ఆమె ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యి ఉంటాయి. అలాగే హీరోయిన్‌కు ఆమె ఇంట్లో ఓ చేతబడి చేసిన బొమ్మ కనిపిస్తుంది. ఇంతకీ ఆ బొమ్మ అక్కడికి ఎలా వచ్చింది. దెయ్యం రూపంలో హీరోయిన్ కలలోకి వచ్చేది ఆమె భర్తా.? లేక మరెవరైనానా.? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ హారర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రం పేరు ‘ది నైట్ హౌస్’. సీన్ సీన్‌కో ట్విస్ట్‌తో అలరించే ఈ భయంకర మూవీలో హారర్ సీన్స్‌తో పాటు పలు బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
మీ పీఎఫ్ అకౌంట్లో ఈ తప్పు పొరపాటున కూడా చేయకండి..
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
టీమిండియా ఎఫెక్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి ఆ టీం ఔట్..?
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ
బ్రిటీషర్ల అహంకారాన్ని దెబ్బకొట్టిన పార్లే జి..ఈ బిస్కెట్ హిస్టరీ