WWW: ఆక‌ట్టుకుంటోన్న డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌.. విడుదల ఎప్పుడంటే..

|

Dec 23, 2021 | 5:31 PM

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తే శివాని.. అథిత్ అరుణ్ జంటగా నటిస్తోన్న చిత్రం డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో

WWW: ఆక‌ట్టుకుంటోన్న డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌.. విడుదల ఎప్పుడంటే..
Www
Follow us on

సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తే శివాని.. అథిత్ అరుణ్ జంటగా నటిస్తోన్న చిత్రం డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ‌’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫస్ట్‌ టైమ్ కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌రు 24న సోనిలీవ్‌లో స్టీమింగ్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ విశేష స్పంద‌న ద‌క్కించుకోగా ఈ చిత్రంలోని న‌టీన‌టుల పాత్ర‌ల‌కు సంబందించి క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్స్‌ను ఈ రోజు విడుదల‌చేశారు మేకర్స్.

ఇందులో అదిత్ అరుణ్ `విశ్వ‌`గా న‌టిస్తుండ‌గా, శివాని రాజ‌శేఖ‌ర్ `మిత్ర` పాత్ర పోషిస్తుంది. వారి మిత్రులుగా `అష్ర‌ఫ్` పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి, `చిష్ట్రి` పాత్ర‌లో దివ్య శ్రీ‌పాద న‌టిస్తున్నారు. వైవా హర్ష, సత్యం రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండగా న‌టుడు రియాజ్ ఖాన్ `ఖాన్‌`పాత్ర‌ధారిగా కనిపించ‌నున్నారు. ఈ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ మూవీకి సిమన్ కె.కింగ్ సంగీతం అందిస్తుండగా.. మిర్చికిరణ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

Also Read: Radhe Shyam Pre Release Event Live: ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..