Gadar 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్.. ‘గదర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
షారుఖ్ నటించిన పఠాన్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. గతంలో భారీ విజయాన్ని అందుకున్న గదర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ వేట మొదలెట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.550 కోట్లు వసూలు చేసి రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘గదర్ 2’ ఒకటి. చాలా కాలం తర్వాత సీనియర్ హీరో సన్ని డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి వరుస డిజాస్టర్లతో అల్లాడుతున్న బీటౌన్కు ఊపిరినిచ్చిందనే చెప్పాలి. షారుఖ్ నటించిన పఠాన్ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం. గతంలో భారీ విజయాన్ని అందుకున్న గదర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ వేట మొదలెట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.550 కోట్లు వసూలు చేసి రికార్డ్స్ బద్దలుకొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది.
ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 6 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది జీ5. డైరెక్టర్ అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ గదర్ 2 అంతకు మించి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మరోసారి రికార్డ్స్ తిరగరాశారు సన్నిడియోల్. అలాగే ఇటు అమిషాకు సైతం సాలిడ్ కంబ్యాక్ అనే చెప్పాలి.
View this post on Instagram
1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో గదర్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. తన కుటుంబం, తన దేశం కోసం తారా సింగ్ (సన్ని డియోల్) ఎలా శత్రువులతో పోరాడారు.. చివరకు తన కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకున్నారు అనేది గదర్ 2 చిత్రం. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా రాబట్టడమే కాకుండా.. అత్యథిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీ జీ5 ఓటీటీలో 4కే క్వాలిటీలో స్ట్రీమింగ్ కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.