AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramabanam OTT: 4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన ‘రామబాణం’.. గోపీచంద్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన రామబాణం తీర థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడింది. రోటీన్‌ కథ కావడంతో ఆడియెన్స్‌ పెదవి విరిచారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. అయితే గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఫ్యాన్స్‌ని మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని రామబాణం త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని భావించారు

Ramabanam OTT: 4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన 'రామబాణం'.. గోపీచంద్‌ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Ramabanam Movie
Basha Shek
|

Updated on: Sep 14, 2023 | 6:49 AM

Share

గోపీచంద్‌ రామబాణానికి ఓటీటీ మోక్షం కలిగింది. సుమారు 4 నెలల తర్వాత ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. శ్రీవాస్‌ తెరకెక్కించిన ఈ మూవీలో డింపుల్‌ హయతీ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్‌ అన్నయ్యగా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో మెప్పించారు. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించిన రామబాణం తీర థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆడలేకపోయింది. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడింది. రోటీన్‌ కథ కావడంతో ఆడియెన్స్‌ పెదవి విరిచారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. అయితే గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఫ్యాన్స్‌ని మెప్పించాయి. థియేటర్లలో పెద్దగా ఆడని రామబాణం త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుందని భావించారు చాలామంది. అయితే నాలుగు నెలల వరకు ఆ ముహూర్తం కుదరలేదు. రామబాణం మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్‌ కొనుగోలు చేసింది. గురువారం (సెప్టెంబర్‌ 14) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం స్ట్రీమింగ్‌ అవుతోంది.

మొత్తానికి 4 నెలల తర్వాత రామబాణం ఓటీటీలోకి రావడంతో గోపీచంద్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మించిన ఈ మూవీలో నాసర్, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌, సచిన్‌ ఖేడ్కర్‌, సత్య, అలీ, రాజా రవీంద్ర, సప్తగిరి, గెటప్‌ శీను, శుభలేఖ సుధాకర్‌ కీ రోల్స్‌ పోషించారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూర్చారు. రామబాణం సినిమాకు భూపతి రాజా కథ అందించగా, మధు సూదన్‌ డైలాగులు సమకూర్చారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా, వెట్రీ పళని స్వామి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. మరి థియేటర్లలో రామబాణం సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

4 నెలల తర్వాత మోక్షం..

ఇక గోపిచంద్ తర్వాతి సినిమాల విషయానికి వస్తే.. భీమా అనే మూవీలో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు హర్ష ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవలే రిలీజైన భీమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌పై సినిమాను ఆసక్తిని పెంచింది. చాలా రోజుల తర్వాత గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. రవి బస్రూర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నాయి.

కొత్త దర్శకుడికి ఛాన్స్‌..

View this post on Instagram

A post shared by Gopichand (@yoursgopichand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?