మనీ, మనీ మనీ వంటి క్రైమ్ కామెడీ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివ నాగేశ్వరరావు. వన్ బై టూ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, ధనలక్ష్మీ ఐలవ్యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ఫొటో, భూ కైలాస్ వంటి సినిమాలు తీశారాయన. అయితే 2009లో నిన్ను కలిశాక సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు శివనాగేశ్వరరావు. దాదాపు 14 ఏళ్ల పాటు సినిమాలు తీయలేదు. అయితే ఈ లాంగ్ గ్యాప్ తర్వాత సీనియర్ డైరెక్టర్ మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నారు. తనకిష్టమైన జోనర్‌లోనే దోచేవారెవరురా వంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఇందులో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, ప్రణవ్ చంద్ర, మాళవికా సతీషన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చి 11న థియేటర్లలో విడుదలైన దోచేవారెవరురా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. సరైన ప్రమోషన్లు కూడా నిర్వహించకపోవడంతో సినిమా జనాలకు రీచ్ కాలేకపోయింది. దీంతో శివనాగేశ్వరరావుకు మరోసారి నిరాశ తప్పలేదు. అయితే థియేటర్ రిలీజ్ తర్వాత సుమారు ఆరు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సెప్టెంబర్ 29 నుంచి దోచేవారెవరురా స్ట్రీమింగ్ కానుంది.
దోచేవారెవరురా సినిమాలో తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, బెనర్జీ వంటి సీనియర్ నటులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఐక్యూ క్రియేషన్స్ బ్యానర్‌పై బొడ్డు కోటేశ్వరరావు ఈ మూవీని నిర్మించారు. రోహిత్ వర్ధన్ సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. సిద్ధు (ప్రణవ్ చంద్ర) జీవనోపాధి కోసం సిద్దు (మాస్టర్ చక్రి)తో కలిసి దొంగతనం చేస్తుంతాడు. లక్కీ (మాళవిక) ఒక కంపెనీలో పనిచేస్తుంటుంది. అతని బాస్ ఆమెను బాగా వేధిస్తుంటాడు. ఒక రోజు ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీయించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ వీడియో ఉన్న ఫోన్ ని దొంగతనం చేసి తెమ్మని సిద్ధుని అడుగుతుంది లక్కీ. సిద్ధు అంతా ప్లాన్ ప్రకారమే చేస్తాడు, కానీ ఆ బాస్ అదే రాత్రి తన ఇంటిలో హత్యకు గురౌతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేసారనేది తెలుసుకోవాలంటే దోచేవారెవరురా సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..