
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. శ్రేష్టి వర్మ, మర్యాద మనీశ్, ప్రియా శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక గత వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దివ్యా నికితా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నాలుగో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. బిగ్‌బాస్ పెట్టిన కొన్ని టాస్కుల్లో సత్తా చాటి కొందరు కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ పవర్ దక్కించుకున్నారు. ఇక మిగిలిన వారు నామినేషన్స్ లోకి వెళ్లారు. ఈ వారం నామినేషన్స్ టాస్కులకు సంబంధించి కెప్టెన్ పవన్ ను సంచాలకుడిగా నియమించాడు బిగ్ బాస్.
కాగా నామినేషన్స్ లో భాగంగా సుమన్ శెట్టి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు. అలాగే రాము సంజనాను నామినేట్ చేశాడు. అయితే తనను నామినేట్ చేసినందుకు గానూ ఎప్పటిలాగే రాముపై నోరు పారేసుకుంది సంజన. దీనికి రాము కూడా గట్టిగానే స్పందించాడు.
‘ కించపరిచేలా మాట్లాడొద్దు’ అంటూ సంజనకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఈ విషయంలో సుమన్ శెట్టి కూడా రామునే సపోర్ట్ చేశాడు. అలాగే భరణి ఫ్లోరాను నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. వీరితో పాటు శ్రీజ, కొత్తగా ఇంట్లోకి వచ్చిన దివ్య నిఖిత, మాస్క్ మ్యాన్ హరీశ్ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే కామనర్స్ కోటాలో హౌస్ లోకి వచ్చిన శ్రీజనే ఈ వారం ఎలిమినేట్ అవ్వనుందని తెలుస్తోంది. గత వారం కూడా ఆమె ఎలిమినేషన్ నుంచి త్రుటిలో తప్పించుకుంది.
Battle of Words Begins!
Nominations set the stage 🔥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/ifq8unPSyx
— Starmaa (@StarMaa) September 30, 2025
Tanuja pans ekada kuda srija ki veyandi votes
Only adireddy poll lo vestey dorkipotharu#BiggBossTelugu9 pic.twitter.com/Q8k9eR6meb— Heisenberg (@bb8holics) September 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.