
ఎప్పటిలాగే గత శుక్రవారం (అక్టోబర్ 10) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, ఇంగ్లిష్ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. గతేడాది డిసెంబర్ 27న రిలీజైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం, పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే ఐఎమ్ డీబీలో ఇప్పటికీ ఈ సినిమాకు పదికి 6.9 రేటింగ్ ఉంది. ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా సుమారు పది నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ కోర్డు డ్రామా. ఓ అమ్మాయి మర్డర్ కేసులో రామస్వామి అనే వ్యక్తి ఇరుక్కుంటాడు. అతనే దోషి అన్నట్లుగా బలమైన సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్షుల్లో ఒకరిగా బిగ్ బాస్ 9 ఫేమ్ తనూజ గౌడ కూడా ఉంటుంది. ఇదే సమయంలో తానేంటో నిరూపించుకోవాలంటూ తపన పడే ఓ లాయర్ ఈ మర్డర్ కేసును టేకప్ చేస్తాడు.
మరి ఆ తర్వాత ఏమైంది? రామస్వామిని ఈ మర్డర్ కేసు నుంచి ఆ లాయర్ బయటపడేలా చేశాడా? అసలు ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారు? అసలు ఆ బాలికకు రామస్వామికి ఉన్న సంబంధం ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రీన ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ కోర్డు సినిమా పేరు లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తనూజతో పాటు మలికిరెడ్డి, ప్రియాంక రెవ్రీ, దయానంద్ రెడ్డి, జయశ్రీ రాచకొండ, ఢిల్లీ గణేష్, వజ్జ వెంకట గిరీధర్, లీలా సాంసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం లీగల్లీ వీర్ సినిమా లయన్స్ గేట్ ప్లే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
The verdict is in! Justice has a new name. #LegallyVeer is now streaming exclusively on @LionsgatePlayIN.
Watch now!’#legallyveeronlionsgateplay #legallyveeronlionsgate #LegallyVeer #VeerReddy #LionsgatePlay #LegalThriller #Delhiganesh pic.twitter.com/SUeVtPIBdC— LegallyVeer (@LegallyVeer) October 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.