బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు వీజే సన్నీ. తనదైన యాటిట్యూడ్ అండ్ బిహేవియర్‌తో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఆతర్వాత ఏటీఎమ్ వెబ్ సిరీస్‌తో హీరోగా ఆకట్టుకున్నాడు అందులో అతని నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు వీజే సన్నీ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ అన్‌స్టాపబుల్.. అన్‌లిమిటెడ్ ఫన్. సన్నాఫ్ ఇండియా ఫేమ్ డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన ఈ మూవీలో కమెడియన్ సప్తగిరి కీలక పాత్రలో నటించాడు. నక్షత్ర, అక్సా ఖాన్ కథానాయికలుగా కనిపించారు. జూన్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే వీజే సన్నీ నటన, సప్తగిరి కామెడీ ఆకట్టుకున్నాయి. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అన్‌స్టాపబుల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో ముందస్తు ఒప్పందం ప్రకారం గురువారం (జులై 20) నుంచే ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎ2బీ ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మించిన అన్‌స్టాపబుల్‌లో రాజరవీంద్ర, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వి, విక్రం ఆదిత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిస్రిలియో స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో అన్‌స్టాపబుల్‌ను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సినిమాను చూసేయండి. కడుపుబ్బా నవ్వుకోండి. కాగా అన్‌స్టాపబుల్ తర్వాత ‘సౌండ్ పార్టీ’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు వీజే సన్నీ. హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తోంది
Hey Machass!
Watch our latest movie #unstoppable @amazonprime https://t.co/n4pSrsvqxt
@actor_sapthagiri @rajithrao @diamondratnababuwriter @nakshatratrinayani @shyamkasarlalyrics @bheemsceciroleo @aqsa0778 @bithirisathiofficial @shakalakashankar85 pic.twitter.com/Nz98WxFR84
— VJ Sunny (@VJSunnyOfficial) July 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..