Ajay Gadu Movie: ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా.. ఇప్పుడు ఫ్రీగా చూసేయ్యోచ్చు..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం.. నాగార్జున్ నా సామిరంగ.. వెంకటేశ్ నటించిన సైంధవ్, తేజా సజ్జా నటించిన హనుమాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఈ చిత్రాలన్నింటికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఓవైపు థియేటర్లలో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా.. అటు ఓటీటీలోనూ పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. క్రైమ్ థ్లిలర్స్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా మంచి వ్యూస్ రాబడుతుంది. కొ

Ajay Gadu Movie: ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ సినిమా.. ఇప్పుడు ఫ్రీగా చూసేయ్యోచ్చు..
Ajay Gadu Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 18, 2024 | 8:27 AM

ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి నాలుగు సినిమాలు. సంక్రాంతి కానుకగా ఈఏడాది నలుగురు హీరోస్ పోటీ పడ్డారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం.. నాగార్జున్ నా సామిరంగ.. వెంకటేశ్ నటించిన సైంధవ్, తేజా సజ్జా నటించిన హనుమాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి. ఈ చిత్రాలన్నింటికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఓవైపు థియేటర్లలో ఈ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా.. అటు ఓటీటీలోనూ పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. క్రైమ్ థ్లిలర్స్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సినిమా మంచి వ్యూస్ రాబడుతుంది. కొద్ది రోజులుగా డిజిటల్ ప్లాట్ ఫాంలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ మూవీ. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా ?… అదే ‘అజయ్ గాడు’.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్‏లో పాల్గొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ కతుర్వర్. ఈ షో తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేస్తూనే.. అటు హీరోగానూ ప్రయత్నిస్తున్నాడు. ఓవైపు హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్న అజయ్.. ఇప్పుడు స్వీయ దర్శకనిర్మాణంలో అజయ్ గాడు సినిమాను తెరకెక్కించాడు. ఇందులో అతడే హీరోగా కనిపించాడు. ముందుగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుహ్యంగా సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది ఈ సినిమా. ఇక రోజు రోజుకీ ఈ మూవీకి మరింత రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు.. ఈచిత్రాన్ని అడియన్స్ ఫ్రీగానే చూసేయ్యోచ్చు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుర్రాడు అజయ్… ప్రపంచం, డబ్బు, పేరు, ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఇబ్బందిపడుతుంటాయి. డ్రగ్స్ కి బానిస అయిన మెడికో శ్వేత ప్రేమలో పడిపోతాడు. ఆమెను సరైన మార్గంలోకి తీసుకురావడానికి అతడు ఎలా ప్రయత్నించాడు అనేది సినిమా. ప్రస్తుతం ఈ చిత్రానికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.