
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో తమిళ్ మూవీ కిడా కూడా ఒకటి. తెలుగులో దీపావళి పేరుతో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అంతేకాదు పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్పెషల్ స్ర్కీనింగ్‌కు కూడా ఎంపికైంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన దీపావళి సినిమా ఆడియెన్స్‌ను బాగా ఆలరించింది. హృదయాన్ని కదిలించే కథా కథనాలు, ఎమోషన్స్ బలంగా ఉండడం ఈ సినిమ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. థియేటర్లలో అలరించిన దీపావళి సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ అవార్డ్ విన్నింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (డిసెంబర్ 15) నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.
ఆర్. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన దీపావాళి సినిమాలో రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, లక్ష్మి, కమలి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థీసన్ స్వరాలు సమకూర్చారు. ఇక దీపావళి సినిమా మొత్తం ఓ పల్లెటూరిలో జరుగుతుంది. తాత, మనవడు, ఓ మేక మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలని మనవడు కోరడంతో మేకను అమ్మడానికి సిద్ధపడతాడు తాత. అయితే మొక్కు ఉన్న మేక కావడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకురారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తాత తన మనవడికి కొత్త బట్టలు కొనిచ్చాడా లేదా తెలుసుకోవాలంటే దీపావళి సినిమా చూడాల్సిందే.
Dive into the heartfelt sneak peek of #Deepavali 🌀
GRAND RELEASE TOMORROW💥
🎟️ https://t.co/GYB3UC8zuH#RAVenkat @kaaliactor @adityamusic pic.twitter.com/7yk2Jn4kLD
— Sri Sravanthi Movies (@SravanthiMovies) November 10, 2023
My mother started crying after watching my film #Deepavali as she felt it reminded her of her husband, my father. Many people got emotional after watching it and this is a great experience for me as a director.
– Director #RAVenkat about #Deepavali.
@kaaliactor @adityamusic pic.twitter.com/PvxuH8O8k9— Sri Sravanthi Movies (@SravanthiMovies) November 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.