భారత మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మై అటల్ హూ’. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో వాజ్ పేయి పాత్రలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి కనిపించారు. పీయూశ్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ బయోపిక్ నవరి 19వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. ముఖ్యంగా వాజ్ పేయి పాత్రలో పంకజ్ త్రిపాఠి ఒదిగిపోయారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన మై అటల్ హూ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వాజ్ పేయి బయోపిక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 14వ తేదీన ఈ బయోపిక్ ను స్ట్రీమింగ్‍కు తీసుకురానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ.
‘అద్భుతమైన దార్శనికత, నిర్ణయాలతో దేశానికి సరి కొత్త దిశ, దశను నిర్దేశించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మై అటల్ హూ’ మార్చి 14న జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది” అని జీ5 ట్వీట్ చేసింది.భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ పతాకాలపై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమరేశ్ భానుశాలి సంయుక్తంగా మై అటల్ హూ సినిమాను నిర్మించారు పాయల్ దేవ్, కైలాశ్ ఖేర్, అమృత్ రాజ్, మొహంతీ శర్మ స్వరాలు సమకూర్చారు. ఓటీటీ కాబట్టి హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం.
Shuru karo taiyaari, aa rahe hain Atal Bihari! #MainAtalHoon premieres on 14th March, only on #ZEE5#AtalOnZEE5#MainAtalHoon@TripathiiPankaj @meranamravi @vinodbhanu @thisissandeeps #KamleshBhanushali @thewriteinsaan #BhaveshBhanushali @directorsamkhan @BSL_Films… pic.twitter.com/so934WIZOu
— ZEE5 (@ZEE5India) March 10, 2024
Proud to present the story of Shri Atal Bihari Vajpayee – the man, the visionary, the legend behind shaping India’s global presence! #MainAtalHoon, streaming from 14th March on #ZEE5#ZEE5Global #AtalOnZEE5 @TripathiiPankaj @meranamravi @vinodbhanu @thisissandeeps… pic.twitter.com/lOMdJcYt8m
— ZEE5 Global (@ZEE5Global) March 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి