AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్పై యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

ఆ మధ్యన స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చిన ధురంధర్, ధురంధర్ ది రివేంజ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కథతోనే ఓ సినిమా గురువారం (మే 14) ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్పై యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 14, 2026 | 9:59 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. ఇప్పటికే తిమ్మరాజుపల్లి టీవీ, కాళిదాసు 2 వంటి సూపర్ హిట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలాగే ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2), కర్తవ్య వంటి సినిమాలు మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి అడుగు పెట్టనున్నాయి. అయితే వీటన్నిటి మధ్య గురువారం (మే 14) అర్ధరాత్రి నుంచే ఓ తమిళ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. గత నెలలోనే థియేటర్లలో విడుదలైంది. అంతర్జాతీయ స్పై మిషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా తమిళ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే.. విస్పోటనానికి సిద్దంగా ఉన్న న్యూక్లియర్ డివైస్‌ను కనిపెట్టడానికి ఇండియన్ స్పై ఏజెంట్స్ రష్యాలో ఓ సీక్రెట్ ఆపరేషన్‌ ప్రారంభిస్తారు. అయితే రష్యాలో మిషన్ ఫెయిల్ కావడం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలో ఇండియన్ స్పై ఏజెంట్స్‌ను దేశద్రోహులుగా ముద్ర వేయాలని ప్లాన్ చేస్తారు. మరి మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసిన ఆ న్యూక్లియర్ ఆయుధాన్ని విచ్చిన్నం చేశారా? ప్రపంచ యుద్దం జరగకుండా ఇండియన్ టీమ్ ఆపరేషన్ సక్సెస్ చేసిందా? అనేది ఈ సినిమా కథ.

తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమైన కోలీవుడ్ విలక్షణ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పేరు ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X). మను ఆనంద్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో ఆర్యతో పాటు టాలెంటెడ్ యాక్టర్ గౌతమ్ , సీనియర్ నటుడు శరత్ కుమార్, హీరోయిన్ మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే అతుల్య రవి, అనఘ, రైజా విల్సన్, జయప్రకాష్, కాళీ వెంకట్ తదితరులు వివిధ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకనేవారికి మిస్టర్ ఎక్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో మిస్టర్ ఎక్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు!
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
కొరియన్ కనకరాజు సినిమా రివ్యూ.. వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా?
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
త్రిఫల-ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆధునిక ఫీచర్లతో దూసుకెళ్తున్న టాటా పంచ్
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు ..
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
డీమాన్ పవన్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? రీతూ చౌదరి ఆన్సర్ ఇదే
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
దేశవ్యాప్తంగా కుండపోత వానలు.. ఐఎండీ వార్నింగ్!
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
భారత సీఎన్‌జీ కార్ల మార్కెట్‌లో సరికొత్త రికార్డులు
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్