Unstoppable Season 4 : అన్‏స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ స్టార్ట్.. ఏపీ సీఎంతో బాలయ్య ఇంటర్వ్యూ..

|

Oct 20, 2024 | 4:45 PM

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు తమ పర్సనల్, కెరీర్ విషయాలను బాలయ్యతో పంచుకున్నారు.

Unstoppable Season 4 : అన్‏స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ స్టార్ట్.. ఏపీ సీఎంతో బాలయ్య ఇంటర్వ్యూ..
Balakrishna, Cm Chandrababu
Follow us on

ఓటీటీ అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాక్ షో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోహీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఈషోకు విచ్చేసి తమ పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇన్నాళ్లు వెండితెరపై మాస్ హీరోగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య.. ఈ అన్‏స్టాపబుల్ టాక్ షో ద్వారా హోస్ట్‏గా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. బాలయ్య హోస్టింగ్ చేస్తున్న ఈ అన్‏స్టాపబుల్ టాక్ షోకు రోజు రోజుకు మరింత రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సీజన్ 4 కూడా స్టార్ట్ చేయబోతున్నారు. త్వరలోనే సీజన్ 4 ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకు ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ సీజన్ సరికొత్త ప్రోమోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అన్‏స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ షో మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబును దగ్గరుండి ఆహ్వానించారు బాలయ్య. ఈ షో తొలి ఎపిసోడ్ ఆహాలో అక్టోబ‌ర్ 25న రాత్రి 8.30 గంట‌ల‌కు స్ట్రీమింగ్ కానుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఈ టాక్ షోలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఆద్యంతం ఆసక్తిగా, సరదాగా సాగిన ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాలయ్యతో కలిసి అన్‏స్టాపబుల్ టాక్ షోలో సందడి చేయబోతున్నారు.

ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

ఇప్పటికే విడుదలైన అన్‏స్టాపబుల్ నాలుగో సీజన్ సరికొత్త ప్రోమో ఆకట్టుకుంటుంది. ఈసారి బాలయ్య బాబుని సూపర్ హీరోగా అభివర్ణిస్తూ చేసిన ప్రోమో అడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. బాలయ్య ఎలా ఉండాలో.. సూపర్ హీరోగా ఎలా చూపించాలో యూనిట్ డిస్కషన్స్ చేస్తూ బాలయ్యను సూపర్ హీరోగా ఎలా మార్చారు అని ఒక్కోటిగా బాలయ్య సినిమాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆసక్తిగా చూపించారు.

 

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.