Animal OTT: ‘మోసం చేశారు.. ఆ సీన్స్‌ ఎక్కడ?’.. ‘యానిమల్‌’ ఓటీటీ వెర్షన్‌పై బాగా హర్టవుతోన్న ఫ్యాన్స్

|

Jan 27, 2024 | 1:02 PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జనవరి 26) 'యానిమల్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రావడంతో ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేశారు. దీనికి తోడు ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు ఉన్నాయంటూ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో థియేటర్స్‌లో చూసిన వారందరూ కూడా యానిమల్‌ ఓటీటీ వెర్షన్  కోసం ఆసక్తిగా ఎదురుచూశారు

Animal OTT: మోసం చేశారు.. ఆ సీన్స్‌ ఎక్కడ?.. యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌పై బాగా హర్టవుతోన్న ఫ్యాన్స్
Animal Movie
Follow us on

గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (జనవరి 26) ‘యానిమల్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రావడంతో ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేశారు. దీనికి తోడు ఓటీటీ వెర్షన్‌లో అదనపు సీన్లు ఉన్నాయంటూ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో థియేటర్స్‌లో చూసిన వారందరూ కూడా యానిమల్‌ ఓటీటీ వెర్షన్  కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి యానిమల్‌ రావడంతో కళ్లప్పగించి చూశారు. అయితే ఓటీటీలో రణ్‌ బీర్‌ కపూర్‌ సినిమా చూసిన ఫ్యాన్స్‌ బాగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కారణం స్పష్టంగా ఉంది. థియేటర్ వెర్షన్‌లో తొలగించిన సన్నివేశాలు OTT వెర్షన్‌లో కూడా ఉంటాయని అంతా భావించారు. కానీ ‘ యానిమల్ ‘ టీమ్ ఆ అంచనాలను తారుమారు చేసింది. థియేటర్‌ వెర్షన్‌ సేమ్‌ టు సేమ్‌ ఓటీటీలోకి దింపేశారు. ఇదే అభిమానుల అసంతృప్తికి కారణమైంది. యానిమల్’ సినిమా నెట్‌ఫ్లిక్స్ OTTలో విడుదలైనప్పుడు, ప్రేక్షకులు మొదట గమనించేది సినిమా వ్యవధి. 3 గంటల 24 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఓటీటీలోనూ విడుదలైంది. అంటే డిలీట్ చేసిన సీన్లేవీ ఇందులో చేర్చలేదు. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. అలాగే రణబీర్ కపూర్, బాబీ డియోల్ మధ్య ముద్దు సన్నివేశం ఉంటుందని తెలిపారు. కానీ OTT వెర్షన్‌లో అలాంటి సీన్స్‌ ఏమీ లేవు. అయితే సినిమాలో అదనపు సన్నివేశాలు జత చేయాలంటే మళ్లీ సెన్సార్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మళ్లీ ఇదొక కొత్త తలనొప్పి. అందుకే థియేటర్‌ వెర్షన్‌ను యధావిధిగా ఓటీటీలోకి తీసుకొచ్చారు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అలాగే మరో బాలీవుడ్‌ బ్యూటీ తృప్తి దిమ్రీ మరో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్‌ విలన్‌ గా మెప్పించగా, రణ్‌ బీర్‌ తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ మెరిశారు. డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ గ్లోబల్ బాక్సాఫీస్ వసూళ్లను కలుపుకుంటే 900 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. సినిమా విడుదలైనప్పుడు పలు విమర్శలు వచ్చాయి. పలు సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలై మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.