Gam Gam Ganesha OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’.. ఎక్కడ చూడొచ్చంటే?

టీజర్లు, పోస్టర్లు,ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసిన గం గం గణేశా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా స్టోరీలో కొత్త ధనం లేకపోయినా టేకింగ్ బాగుందని, ఎప్పటిలాగే ఆనంద్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందని రివ్యూలు వచ్చాయి. కామెడీతోపాటు ట్విస్టులు అదిరిపోయాయని ప్రశంసలు వచ్చాయి

Gam Gam Ganesha OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ గం గం గణేశా.. ఎక్కడ చూడొచ్చంటే?
Gam Gam Ganesha Movie

Updated on: Jun 20, 2024 | 7:42 AM

బేబీ సినిమాతో క్రేజీ హీరోల లిస్టులో చేరిపోయాడు ఆనంద్ దేవర కొండ. ఇందులో లవ్ ఫెయిల్యూర్ యువకుడిగా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తోన్న ఆనంద్ నటించిన తాజా చిత్రం గం గం గణేశా. టైటిల్ తోనే ఆసక్తిని రేపిన ఈ చిత్రంలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్లు, పోస్టర్లు,ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసిన గం గం గణేశా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా స్టోరీలో కొత్త ధనం లేకపోయినా టేకింగ్ బాగుందని, ఎప్పటిలాగే ఆనంద్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందని రివ్యూలు వచ్చాయి. కామెడీతోపాటు ట్విస్టులు అదిరిపోయాయని ప్రశంసలు వచ్చాయి. అయితే బరిలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తి కేయ భజే వాయు వేగం వంటి సినిమాలో ఉండడంతో ఓ మోస్తరు వసూళ్లకే పరిమితమైంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన గం గం గణేశా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా సైలెంట్ గా, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో గం గం గణేశా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో గురువారం (జూన్ 20) అర్ధరాత్రి నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

గం గం గణేశా సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. ఆయనకు ఇదే ఫస్ట్ సినిమా. హైలైఫ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో కేదార్ సెలగంశెట్టితో కలిసి వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. నయన్ సారిక, సత్యం రాజేశ్, అర్జున్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీకి స్వరాలు అందించారు. ఆదిత్య జవ్వాది కెమెరామెన్ గా వ్యవహరించగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మరి థియేటర్లలో ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.