ఏమాత్రం అంచనాల్లేకుండా చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. జులై 14న విడుదలైన ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ 9 రోజుల్లోనే ఏకంగా 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ ఈపాటి కలెక్షన్లు రాబట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదిలా ఉంటే బేబీ సినిమాకు సంబంధించి ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. థియేటర్లో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ యూత్‌ఫుల్‌ఎంటర్ టైనర్ అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యంగా ఓటీటీలోకి రానుందట. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా బేబీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే థియేటర్లలో రిలీజైన 4-5 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అయితే థియేటర్లలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను ఓటీటీ రిలీజ్ డేట్ మార్పు జరిగిందని టాక్ వినిపిస్తోంది. మరింత ఆలస్యంగా అంటే ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బేబీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎసన్ ఈ మూవీని నిర్మించారు. విజయ్ బుల్గానిన్ అందించిన స్వరాలు మూవీకి హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు నిర్వహిస్తోంది బేబీ యూనిట్. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో పర్యటిస్తోంది.
Team #BabyTheMovie Visited Tirumala and took the blessings of Lord Venkateswara Swamy 😇, During the Success tour of #Baby ❤️#CultBlockbusterBaby ❤️🔥@ananddeverkonda @viraj_ashwin @SKNonline @sairazesh @iamvaishnavi04 @GskMedia_PR @MassMovieMakers
Book your tickets now 🎟️ :… pic.twitter.com/GH4AW1YDur— BA Raju’s Team (@baraju_SuperHit) July 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.