Urvasivo Rakshasivo: ఆహా అందిస్తున్న మరో సూపర్ హిట్ మూవీ.. ఉర్వశివో రాక్షసివో స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

|

Dec 02, 2022 | 11:30 AM

ఆ మధ్య శ్రీ రాస్తూ శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో శిరీష్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

Urvasivo Rakshasivo: ఆహా అందిస్తున్న మరో సూపర్ హిట్ మూవీ.. ఉర్వశివో రాక్షసివో స్ట్రీమింగ్  ఎప్పుడంటే.?
Urvasivo Rakshasivo
Follow us on

అల్లు శిరీష్ రీసెంట్ గా ఉర్వశివో రాక్షసివో సినిమా సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు శిరీష్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ మధ్య శ్రీ రాస్తూ శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శిరీష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఉర్వశివో రాక్షసివో సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఇందులో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శిరీష్, అను రొమాన్స్ నెక్స్ట్ లెవల్. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఆహాలో అలరించడానికి రెడీ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆహాలో ఈ మూవీ డిసెంబర్ 9నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఉర్వశివో రాక్షసివో చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.