ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. ఇతర జానర్లతో పోల్చుకుంటే ఈ కేటగిరీ సినిమాలనే చూడడానికి ఓటీటీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకు తగ్గట్టే ఓటీటీ సంస్థలు కూడా ఈ జానర్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయి. ఇతర భాషల్లో రిలీజైన సినిమాలను సైతం డబ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా ఇటీవల డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఓ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అదే అల్లరి రవిబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన చిత్రం రష్ మూవీ. కొన్ని కారణాలతో థియేటర్లలో కాకుండా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ మూవీ రిలీజైంది. ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియెన్స్ మెప్పు పొందుతోంది. రికార్డు వ్యూస్ తో అదరగొడుతోంది. తాజాగా ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో రష్ కూడా ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సతీశ్ పోలోజు దర్శకత్వం వహించాడు. డైసీ బోపన్న హీరోయిన్‌గా నటించింది. ఒక సాధారణ గృహిణికి కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనే ఆసక్తికర కథనంలో ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
కార్తీక (డైసీ బోపన్న), ఆదిత్య (కార్తీక్ ఆహుతి) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. ఓ రోజు ఆదిత్యకు యాక్సిడెంట్ కావడంతో ఆస్పత్రి పాలవుతాడు. అతనిని చూసేందుకు హాస్పిటల్‌కు బయలుదేరిన కార్తీకకు దారిలో అనుకోని సంఘటన ఎదురవుతుంది. కొందరు బైకర్స్‌తో గొడవ జరుగుతుంది. ఆ బైకర్స్‌ను నర్సింగ్ (వీరన్న చౌదరి) చంపేసి ఆ నేరాన్ని కార్తీకపై నెట్టేస్తాడు. మరోవైపు కార్తీక కుమారుడిని నర్సింగ్ కిడ్నాప్ చేస్తాడు. కొడుకు కావవాలంటే పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఓ బ్యాగ్ తమకు కావాలని డిమాండ్ చేస్తాడు నర్సింగ్. మరి ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? కుమారుడి కోసం కార్తీక ఏం చేసింది? ఈ కేసును విచారిస్తోన్న పోలీస్ ఆఫీసర్ శివ (అల్లరి రవిబాబు) కార్తీక గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు? అన్నదే రష్ మూవీ కథ. వీకెండ్ లో మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే రష్ మీకు మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.