Aha-Telugu Indian Idol 2: తెలుగు ఇండియన్ ఐడల్ 2 విజేతగా సౌజన్య.. అల్లు అర్జున్‏ ఎమోషనల్ కామెంట్స్..

|

Jun 04, 2023 | 9:57 PM

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 సీజ‌న్ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌టం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బన్నీ ఎంట్రీతో ఫైనల్ చాలా సరదాగా సాగింది. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ఈ సీజ‌న్ 2 విజేత‌ను ప్ర‌క‌టించారు. ఎంతో ఉత్కంఠ‌త‌తో నువ్వా నేనా అనేంత‌లా పోటా పోటీగా జ‌రిగిన ఫైన‌ల్‌లో విశాఖప‌ట్నంకు చెందిన సౌజ‌న్య భాగ‌వ‌తుల విజేత‌గా నిలిచింది.

Aha-Telugu Indian Idol 2: తెలుగు ఇండియన్ ఐడల్ 2 విజేతగా సౌజన్య.. అల్లు అర్జున్‏ ఎమోషనల్ కామెంట్స్..
Telugu Indian Idol 2 Final
Follow us on

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2 షోతో సంగీతం ప్రియులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మొదటి సీజన్ కు భారీ విజయాన్ని అందుకోవడంతో.. సెకండ్ సీజన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. మార్చిలో స్టార్ట్ అయిన ఈ సెకండ్ సీజన్ ఇప్పుడు ఐనల్ కు చేరుకుంది. 5 మంది కంటెస్టెంట్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 సీజ‌న్ ఫినాలేకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. బన్నీ ఎంట్రీతో ఫైనల్ చాలా సరదాగా సాగింది. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ఈ సీజ‌న్ 2 విజేత‌ను ప్ర‌క‌టించారు.  పోటా పోటీగా జ‌రిగిన ఫైన‌ల్‌లో విశాఖప‌ట్నంకు చెందిన సౌజ‌న్య భాగ‌వ‌తుల విజేత‌గా నిలిచింది. టైటిల్ తోపాటు.. పది లక్షల నగదు బహుమతిని ఆమెకు బన్నీ అందజేశారు. ఇక ఫస్ట్ రన్నరప్ గా జయరాజ్ నిలవగా.. రూ. 3 లక్షలు సొంతం చేసుకున్నాడు. అలాగే సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్యకు 2 లక్షల చెక్‌ను అందించారు బన్నీ.

ఈ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆహావారు అందించిన తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2 ఫినాలేలో పాల్గొన‌టం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. సంగీతంలో ఎంతో ప్ర‌తిభావంతులైన వీరి ప్ర‌ద‌ర్శ‌న చూసి మ‌న‌సంతా ఆనందంతో నిండిపోయింది. ఈ షో నాకెంతో ప్ర‌త్యేక‌మైన‌ది, మ‌ర‌చిపోలేని జ్ఞాప‌కంగా మిగిలింద‌నాలి. సౌజ‌న్య‌కు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. రెండేళ్ల చిన్నారికి త‌ల్లిగా ఉంటూ ఎంతో అంకిత భావంతో ఈ పోటీల్లో పాల్గొన‌టం.. ఓ వైపు సంగీతం, మ‌రో వైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవ‌టం అనేది అంత సులువైన విష‌యం కాదు. ఆమె అంకిత భావం, నిబ‌ద్ధ‌త చూస్తే గౌర‌వం పెరిగింది. ఆమెకు కుటుంబం నుంచి వ‌చ్చిన మ‌ద్ద‌తు ఎంత గొప్ప‌గా ఉందో, దాని ప్రాముఖ్య‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే ఆమె భ‌ర్త నుంచి ల‌భించిన స‌హ‌కారం, ప్రేమ చూస్తే ఆమె ఎంతో అదృష్ట‌వంతురాల‌ని అనిపిస్తుంది. సౌజ‌న్య సాధించిన ఈ విజ‌యం అంద‌రికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది. ఆమె సంగీత ప్ర‌యాణంలో ఇలాంటి విజ‌యాల‌ను మ‌రెన్నింటిలో అందుకోవాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

తెలుగు ఇండియన్ ఐడల్ 2 విజేతగా నిలిచిన సౌజన్య భాగవతుల మాట్లాడుతూ ‘‘ఆహా వారి తెలుగు ఇండియ‌న్ 2లో విజేత‌గా నిల‌వ‌టం, ముఖ్యంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవ‌టం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. క‌ల నిజ‌మైన‌ట్లు ఉంది. ఆయ‌న అందించిన ప్రోత్సాహం, ప్ర‌శంస‌లను నేనెప్ప‌టికీ మ‌ర‌చిపోను. ఈ మ్యూజిక‌ల్ జ‌ర్నీ నాలోని ప‌ట్టుద‌ల‌ను మ‌రింత‌గా పెంచింది. ఇంత గొప్ప వేదిక‌ను అందించిన ఆహా వారికి, న్యాయ నిర్ణేత‌ల‌కు, నా తోటి కంటెస్టెంట్స్‌కు, మా వెనుక ఉండి ప్రోత్స‌హించిన టీమ్‌కి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. జీవితంలో ఈ క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఇంకా గొప్ప‌గా రాణించ‌టానికి ప్ర‌య‌త్నిస్తాను’’ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.