ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు.. అదిరిపోయే వెబ్ సిరీస్‌లను అందిస్తుంది. తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులకు దగ్గరైన ఆహా ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్‌లతో పాటు ఆకట్టుకునే టాక్ షోలు, అలరించే గేమ్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వెబ్ సిరీస్‌తో పేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేసింది ఆహా టీమ్. రొటీన్‌కు భిన్నంగా ఉండే కథలతో సిరీస్ లను తెరకెక్కిస్తున్న ఆహా.. ఇప్పుడు పౌరాణిక వెబ్ సిరీస్‌తో రానుంది.
“చిరంజీవ” అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఓ కొత్త వెబ్ సిరీస్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ఆహా సంస్థ. “యముడితో ఆట”అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రానున్న ఈ సిరీస్ జనవరి 2025లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ డైరెక్టర్ అభినయ కృష్ణ రూపొందించిన, చిరంజీవ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు. అద్భుతమైన కథనంతో ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి.
ఎ. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించిన ఈ సిరీస్‌కు ప్రఖ్యాత స్వరకర్త అచ్చు రాజమణి ఆకర్షణీయమైన స్కోర్‌నుఅందించనున్నారు. ఇక ఈ సిరీస్ లో నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. టైటిల్ తోనే సిరీస్ పై ఆసక్తి పెరిగిపోయింది. ఇక వెబ్ సిరీస్ లో ఎవరెవరు నటిస్తున్నారో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ కు సంబందించిన అదిరిపోయే అప్డేట్స్ ఇవ్వనున్నారు ఆహా టీమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.