
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ 5 లో ప్రేక్షుకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్ తో ఆట అనే కొత్త సెగ్మెంట్ ను ప్రారంభించారు. షో నడుస్తున్న టైంలోనే గెస్టులతో పాటు ప్రేక్షుకులకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. వారు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపుతారు. అందులో తాజాగా గెలిచిన ఇద్దరు లక్కీ విన్సర్స్ కు సూపర్ హోస్ట్ సుడిగాలి సుధీర్ ఫ్రాంక్లిన్ ఈవీ బైక్ లను అందజేశారు. మరోవైపు సర్కార్ సీజన్ 5 విజయవంతం కావడం పట్ల ఆహా యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి మరిన్ని షోలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
కాగా ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా అలరించిన ప్రోగ్రామ్స్ లో ఆహా సర్కార్ సీజన్ ఒకటి. ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఐదో సీజన్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 6న ప్రారంభమైన సర్కార్ సీజన్ 5లో మొత్తం ఎపిసోడ్లు జరిగాయి. ఆగస్టు 22 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. పొలిమేర హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, దక్ష నగార్కర్, కోర్టు సినిమా హీరో, హీరోయిన్లు హర్ష్ రోహన్, శ్రీదేవి అలాగే నైన్టీస్ వెబ్ సిరీస్ ఫేమ్ వాసంతిక, నవదీప్, ప్రియదర్శి, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, ప్రదీప్ మాచిరాజు ఇలా ఎందరో సెలబ్రిటీలు ఈ సీజన్ లో సందడి చేశారు. తమ ఆట పాటలతో ఆడియెన్స్ ను అలరించారు. ఈ క్రమంలో ఆహా సర్కార్ ఆరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.