Balakrishna: వినూత్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటోన్న తొలి తెలుగుల ఓటీటీ ‘ఆహా’ నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే టాక్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు ఇతరులకు ఇంటర్వ్యూలు ఇచ్చిన బాలకృష్ణ తొలిసారి తోటి నటీనటులను ఇంటర్వ్యూ చేస్తుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఆహా ఓటీటీ బాలకృష్ణతో షో నిర్వహించనున్నామని ప్రకటించిననాటి నుంచి ఈ షోపై ఎక్కడలేని క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక తొలి ఎపిసోడ్‌లో భాగంగానే నటుడు మోహన్ బాబును ఇంటర్వ్యూ చేశారు బాలయ్య. ఈ క్రమంలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, షోలో అతను చేసిన అల్లరి పనులు ప్రేక్షకులను ఫిదా చేశాయి. దీంతో ఆహాకు సబ్‌స్క్రైబర్స్ సైతం పెరిగారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ షో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఏకంగా 4 మిలియన్లకు పైగా లైక్‌లతో అన్‌స్టాబబుల్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ షో 4 మిలియన్లకుపైగా వీడియో ప్లేతో టాప్ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ చేతికి గాయం కావడం వల్ల కొన్ని రోజులు షో వాయిదా పడింది. అయితే తాజాగా కోలుకున్న బాలయ్య బాబు వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ప్రేక్షకులను మరింత మెస్మరైజ్ చేయడానికి ఆహా టీమ్.. మరికొంత మంది సెలబ్రిటీలను లైన్‌లో పెడుతున్నట్లు సమాచారం.
దీంతో అన్‌స్టాబబుల్ విత్ ఎన్‌బీకే షో మరింత దూసుకుపోతుందని ఆహా యూనిట్ భావిస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఇది కూడా పూర్తికాగానే పూరి జగన్నాథ్, అనీల్ రావిపూడిని లైన్‌లో పెట్టే యోచనలో ఉన్నారు బాలయ్య.
Also Read: Hyderabd: చాదర్ ఘాట్ లో స్విఫ్ట్ బీభత్సం.. కారుతో పాటు మహిళ పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు.. సమస్యలను అధిగమిస్తారు..!