సూపర్ హిట్ చిత్రాలతోపాటు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. టాక్ షోలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది ఆహా ఓటీటీ. ఎప్పటికప్పుడు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. తెలుగు ప్రేక్షకుల అదరాభిమానాలు పొందుతూ ఓటీటీ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ఆహా మరో కొత్త కంటెంట్ తో సినీ ప్రియుల ముందుకు వస్తోంది. ఆహా ‘గోదారి’ పేరుతో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు చూపేందుకు స్వాతి దివాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రత్యేక డాక్యుమెంటరీ మార్చి 30 న ప్రసారం కానుంది. ” త్రయంబకేశ్వర్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నది గోదారి” .
ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీ విపణికి ఒక మైలురాయిగా నిలువనుంది. వినోద రంగంలో సంప్రదాయ వినోద కార్యక్రమాలు కాకుండా, ఈ తరహా డాక్యుమెంటరీలు మరిన్ని వచ్చేందుకు ‘ఆహా గోదారి’ దోహదపడుతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి డాక్యూమెంటరీ మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అత్యద్భుతమైన ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది.
దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ, ఆహా ఓటీటీ ద్వారా ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించనుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించినట్టు వివరించారు. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపనున్నట్టు తెలిపారు.
Join us at Prasad Labs tomorrow at 3 PM for the screening of aha Godari, a heart-warming 100% Telugu documentary that showcases the beauty of Godavari river and Telugu culture around it. #ahaGodari@GyaboStories pic.twitter.com/myGPWB7jg9
— ahavideoin (@ahavideoIN) March 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.