Hit 2 OTT: ఓటీటీలోకి అడివి శేష్ హిట్-2.. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
హిట్ 2 సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు చెక్ పడే సమయం ఆసన్నమైంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేశ్ ప్రస్తుతం ఫుల్ జోషలో ఉన్నాడు. తనకు అచ్చొచ్చిన థ్రిల్లర్ జానర్‌లో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ ఏడాది మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్‌హిట్ కొట్టిన అడివిశేష్.. హిట్-2తో మరో బ్లాక్‌బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. గతంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘హిట్ ది ఫస్ట్ కేస్’ ఇది సీక్వెల్. మొదటి భాగాన్నే తెరకెక్కించిన శైలేష్ కొలను హిట్2 ను కూడా మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమింట్స్‌తో ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించారు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. ఈక్రమంలో హిట్ 2 సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు చెక్ పడే సమయం ఆసన్నమైంది. సంక్రాంతి కానుకగా అడివి శేష్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
హిట్2 సినిమా సినిమా హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ పోటీ పడగా భారీ ధరకు అమెజాన్ సంస్థ దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న కాగా ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ హిట్ యూనివర్స్ థర్డ్ పార్ట్ కూడా రాబోతుంది. ఇందులో నాని హీరోగా నటించబోతున్నట్లుగా హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా.. అడివి శేష్ సైతం నటించనున్నారట. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటించనున్నారని టాక్.
#HIT2 OTT RELEASE JAN 14@PrimeVideoIN pic.twitter.com/CfxOD5PxOq
— OTTGURU (@OTTGURU1) January 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..