Mishan Impossible: ఓటీటీలోకి తాప్సీ సినిమా.. మిషన్ ఇంపాజిబుల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Apr 21, 2022 | 6:27 PM

చాలా కాలం తర్వాత తాప్సీ పన్నూ (Taapsee Pannu) తెలుగులో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible).

Mishan Impossible: ఓటీటీలోకి తాప్సీ సినిమా.. మిషన్ ఇంపాజిబుల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Tapsee
Follow us on

చాలా కాలం తర్వాత తాప్సీ పన్నూ (Taapsee Pannu) తెలుగులో నటించిన చిత్రం మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible). బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఫుల్ జోరుమీదున్న ఈ అమ్మడు.. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ఈ చిత్రానికి డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 1న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తోపాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ఈ సినిమా ఏప్రిల్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫేమస్ కావాలనుకుని.. అందుకోసం లెక్కలేనంత డబ్బు సంపాదించాలనే ముగ్గురు చిన్నారుల కథే ఈ మిషన్ ఇంపాజిబుల్. ఇందులో హర్ష రోషన్, భాను ప్రకాష్, జైతీర్థ అనే ముగ్గురు బాలనటులు తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. ఫేమస్ కావాలనుకున్న ఈ ముగ్గురు చిన్నారుల.. ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులకు అప్పజెప్పి.. అతని పైనున్న రివార్డ్ రూ. 50 లక్షలను తెచ్చుకువడమే మిషన్ ఇంపాజిబుల్. ఆ చిన్నారులు ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోవాలనుకోవడం.. దారి తప్పి బెంగుళూరులో దిగేస్తారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగింది.. క్రిమినల్ ను పట్టుకోవడానికి వచ్చిన చిన్నారులకు .. పాత్రికేయురాలు శైలజ (తాప్సీ) తో జరిగిన పరిచయం.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిషన్ ఇంపాజిబుల్ స్టోరీ.

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?