Vijay Sethupathi: విలక్షణ నటనతో తమిళంతోపాటు..తెలుగులోని విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విజయ్ సేతుపతి. కేవలం హీరోగానే కాదు.. విలన్ పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమాలో విజయ్ రాయనం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే తలపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. అటు తెలుగు, తమిళ్ తోపాటు.. ఇతర భాషల నుంచి కూడా మక్కల్ సెల్వన్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో విజయ్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే విజయ్ చేతిలో దాదాపు 25 సినిమాల వరకు ఉన్నాయి. దీంతో డేట్స్ కుదరక చాలా వరకు సినిమాలను రిజెక్ట్ చేసుకున్నాడట విజయ్ సేతుపతి. తాజాగా మక్కల్ సెల్వన్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడట.
ఓటీటీలో విశేష ప్రేక్షకాదరణ పోందుతున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు ఓటీటీ ప్రేక్షకులు సూపర్ హిట్ అందించారు. ఇప్పుడు దీనికి కొనసాంగిపుగా సీజన్ 3 కూడా త్వరలోనే రాబోతుంది. సీజన్ 3 మరింత బ్లాక్ బస్టర్ హిట్ గా చేసేందుకు మేకర్స్.. రాజ్ అండ్ డీకే ఓ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో విజయ్ సేతుపతిని కీలక పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే విజయ్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ చేయాల్సి ఉండగా.. అది కుదరలేదు. దీంతో సీజన్ 3లో విజయ్ ను తీసుకోవడం వలన ఈ సిరీస్ కు మరింత హైప్ తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఒక వేళ విజయ్ సేతుపతి ఈ సిరీస్ లో నటిస్తే.. నిజంగానే ది ప్యామిలీ మ్యాన్ 3 సీజన్ కు మరింత హైప్ వచ్చినట్లే. అయితే ఇందులోని విజయ్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Manisha Koirala: హిందీలోకి ‘అల వైకుంఠపురంలో’.. టబు పాత్రలో కనిపించనున్న సీనియర్ టాప్ హీరోయిన్…