కోలీవుడ్ హీరో సూర్య నటించే చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హీరోయిజం చూపించే సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దక్షిణాదిలో స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సూర్య.. ఇటీవలే కంగువ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ నిర్మించారు. నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ సినిమాకు అంతంగా రెస్పాన్స్ రాలేదు.
భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా నిరాశను మిగిల్చింది. ఇందులో సూర్య నటనపై మరోసారి ప్రశంసలు వచ్చినప్పటికీ సినిమాలో కొంతభాగం సాగదీతగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 8 నుంచి ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించగా.. బీటౌన్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రష్యాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పిల్లలను బంధించి వారిపై ప్రయోగాలు చేస్తుంటారు. వారి నుంచి తప్పించుకున్న ఓ పిల్లాడు సూర్య దగ్గరకు చేరతాడు. అసలు పిల్లాడు ఎవరు.. ? సూర్యకు ఆ పిల్లాడికి ఉన్న సంబంధం ఏంటీ.. ? అసలు కంగువ అంటే ఎవరు ? అనేది ఈ చిత్రం.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.