Janaka Aithe Ganaka OTT: ఆహాలో అదరగొడుతున్న ‘జనక అయితే గనక’.. సుహాస్ మూవీ సరికొత్త రికార్డ్.. ఇంతకీ మీరు చూశారా..?

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో సుహాస్. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల జనక అయితే గనక మూవీతో మెప్పించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Janaka Aithe Ganaka OTT: ఆహాలో అదరగొడుతున్న జనక అయితే గనక.. సుహాస్ మూవీ సరికొత్త రికార్డ్.. ఇంతకీ మీరు చూశారా..?
Janaka Aithe Ganaka Movie

Updated on: Nov 10, 2024 | 7:55 PM

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జనక అయితే గనక సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో సంగీర్తన విపిన్ కథానాయికగా నటించింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే ట్రైలర్ టీజర్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలోని ‘నేనేది అన్నా.. బాగుంది కన్నా’ అనే సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయింది. ఈ పాట అందరినీ మెస్మరైజ్ చేసింది. దీంతో సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక అదే సమయంలో చిత్రయూనిట్ గట్టిగానే ప్రమోషన్స్ నిర్వహించడంతో చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 12న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ బోల్డ్ గా ఉన్నప్పటికీ ఎలాంటి అసభ్యతకు తావులేకుండా ఈ చిత్రాన్ని రూపొందించారంటూ ప్రశంసలు కురిపించారు.

ఇక ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశాడు సుహాస్. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుటు ఆహా ఓటీటీలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. నవంబర్ 8 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు 50 మిలియన్స్ వ్యూస్ రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతకు ముందు సుహాస్ నటించిన ప్రసన్న వదనం మూవీ సైతం 100 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ అందుకుంది.

ఈ మూవీలో గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చగా.. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Tollywood: ఆ ఒక్క డైలాగ్‏తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?

Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..

Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.