AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కాలేజీ లైబ్రరీలో 42 దెయ్యాలు.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..

ఈ సినిమా కథంతా ఒక మెడికల్ కాలేజీ చుట్టూ తిరుగుతుంది. ఇందులోని కొందరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మరి ఆ స్టూడెంట్స్ బలవన్మరణాలకు కారణమేంటి? గతంలో ఆ మెడికల్ కాలేజీలో ఏం జరిగింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

OTT Movie: కాలేజీ లైబ్రరీలో 42 దెయ్యాలు.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 10:06 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేయనున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ తెలుగు సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను వణికిస్తుంది. ఈ సినిమా గతేడాది థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ మంచి వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా బీజీఎమ్ అందరినీ భయపెట్టింది. అలాగే కంటెంట్ పరంగా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూపించని సరికొత్త పాయింట్ ను ఇందులో చూపించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ మెడికల్‌ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు.ఈ విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు, ప్రేతాత్మలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఆహ్వానం మేరకు ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్‌లో అతనికి సంచలన విషయాలు తెలుస్తాయి. అదే సమయంలో కాలేజీ లెక్చరర్‌ అవంతిక అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది? మరి కాలేజీలో జరుగుతున్న మరణాలకు కారణమేంటి? డయానా, నాన్సీ ఎవరు? అసలు కాలేజీ లైబ్రరీలో ఏముంది? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమ పేరు శబ్ధం. గతంలో వైశాలి వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన అరివళగన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆది పినిశెట్టి (వ్యోమ వైద్యలింగం), సిమ్రాన్‌ (డయానా), లైలా (నాన్సీ), లక్ష్మీ మీనన్‌ (అవంతిక) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్, వివేక్ ప్రసన్న, టీఎస్సార్ శ్రీనివాసన్ తదితరులు కూడా ఈ సినిమాలో మెరిశారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చింది. అయితే గత వారమే తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం శబ్ధం సినిమా జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు తెలుగులోనూ ఆది పినిశెట్టి శబ్దం సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్
అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్