కోలీవుడ్‌లో ‘ఆన్‌లైన్‌ రిలీజ్’‌ రచ్చ.. సూర్యకు నిర్మాతల మద్దతు..!

జ్యోతిక ప్రధానపాత్రలో సూర్య నిర్మించిన చిత్రం 'పొన్‌మగల్‌ వందాల్'‌. మామూలుగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు.

కోలీవుడ్‌లో 'ఆన్‌లైన్‌ రిలీజ్'‌ రచ్చ.. సూర్యకు నిర్మాతల మద్దతు..!
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 3:43 PM

జ్యోతిక ప్రధానపాత్రలో సూర్య నిర్మించిన చిత్రం ‘పొన్‌మగల్‌ వందాల్’‌. మామూలుగా ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల అవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సూర్య సిద్ధమయ్యారు. ఈ మేరకు ఓ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంతో ఈ హీరో ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన తమిళనాడు థియేటర్ల అసోషియేషన్.. సూర్య నిర్మించే చిత్రాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ హీరోకు నిర్మాతలు మద్దతు తెలిపారు. ఈ మేరకు టి.శివ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటనలో ”కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి సమయంలో చిన్న చిత్రాల నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే విధంగా ఆన్‌లైన్‌లో సినిమాలు విడుదల చేయడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో సూర్య నిర్మించిన పొన్‌మగల్‌ వందాల్‌ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయడాన్ని థియేటర్ల సంఘం వ్యతిరేకించడం సరికాదు. చిన్న సినిమాలు ఆన్‌లైన్‌లో విడుదల అవ్వడం వల్ల థియేటర్లలో విడుదల అయ్యే మూవీల సంఖ్య కూడా తగ్గుతుంది” అని వివరించారు. ఇక అందులోనే ఒక సినిమా కోసం తాను పెట్టిన ప్రతి రూపాయిని రప్పించుకునే హక్కు నిర్మాతకు ఉంటుంది అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే విజయ్‌ నటించిన మాస్టర్, సూర్య నటించిన సూరరైపొట్రి వంటి భారీ చిత్రాలను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ మరింత పొడిగించే అవకాశం ఉండటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: లాక్‌డౌన్‌ పొడిగించండి: మోదీని కోరిన సీఎం జగన్