Upasana: ‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు’.. వాలంటైన్స్‌డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేసిన ఉపాసన..

|

Feb 14, 2022 | 5:16 PM

Upasana: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు పోస్టులు చేస్తున్నారు. తమకు ఇష్టమైన వారికి ప్రేమికుల రోజు విషెస్‌ చెబుతూనే మరోవైపు ప్రేమ గొప్పతనాన్ని వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కూడా ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన...

Upasana: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు.. వాలంటైన్స్‌డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేసిన ఉపాసన..
Upasana
Follow us on

Upasana: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు పోస్టులు చేస్తున్నారు. తమకు ఇష్టమైన వారికి ప్రేమికుల రోజు విషెస్‌ చెబుతూనే మరోవైపు ప్రేమ గొప్పతనాన్ని వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కూడా ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేశారు. తమ వివాహ బంధానికి 10 ఏళ్లు అయిందని తెలుపుతూ పోస్ట్‌ చేసిన ఉపాసన ప్రేమ గొప్పతనం గురించి వివరించారు. భార్యభర్తల బంధం కలకాలం నిలిచిపోవాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్‌ షేర్‌ చేశారు.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ‘నేను, చరణ్‌ వివాహం చేసుకుని పదేళ్లు పూర్తయింది. ప్రేమికుల రోజు ఎప్పుడూ ప్రత్యేకమే. మీరు ప్రేమిస్తున్న వారితో మీ బంధం మరింత బలంగా మారాలంటే ఈ టిప్స్‌ పాలో కావాల్సిందే. వివాహ బంధంలో ఆరోగ్యానికి ప్రముఖ స్థానం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంపై కచ్చితంగా దృష్టి సారించాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఫిట్‌నెస్‌తో ఉండాలి. మిమ్మల్ని ఇష్టపడేవారికి, మీరు ఇష్టపడేవారికి కచ్చితంగా సమయం కేటాయించాలి. దీనిని నిత్యకృత్యంగా మార్చుకోవాలి. కాస్త సమయం దొరికినా సరే సినిమాలు చూడడం, కబుర్లు చెప్పుకోవడం, డిన్నరేట్‌ డేట్‌కు వెళుతుండాలి. మీరు ఇప్పటి వరకు ఈ పని చేయకపోతే వెంటనే ప్రారంభించండి. బలమైన బంధానికి ఇది చాలా అవసరం. ఇక అందరూ పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. కానీ అది నిజం కాదు, భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడితేనే వారి వివాహానికి పునాది పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన.

ఇక ఉపాసన ఈ విషయాలు చెబుతున్నంతసేపు బ్యాగ్రౌండ్‌లో రామ్‌, చరణ్‌ ఉపాసనలు సంతోషంగా గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫోటోలు ప్లే అవుతూ ఉన్నాయి. బంధం బలపడడానికి ఉపాసన చెప్పిన టిప్స్‌ను ఈ జంట ఎప్పటి నుంచో ఫాలో అవుతుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. అందుకే ఈ జంట అన్యోన్యంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకేంటి మరి.. ఉపాసన చెప్పిన టిప్స్‌ను మీరు కూడా ఫాలో అవ్వండి, బంధాన్ని మరింత బలంగా మార్చుకోండి.

Also Read: Basvaraj Bommai: సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలల్లో సౌమ్యుడు కఠినంగా మారాడు.. కారణం అదేనా?

Watch Video: రైలు పట్టాలపై పడిన బాలికను రక్షించిన యువకుడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!