నాని కొత్త మూవీ.. హిట్ కాంబినేషన్‌కు బ్రేక్‌లు..!

నాని కొత్త మూవీ.. హిట్ కాంబినేషన్‌కు బ్రేక్‌లు..!

నాచురల్ స్టార్ నాని తన నెక్ట్స్ మూవీని ప్రకటించేశాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో తన కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌ను ఇచ్చిన శివ నిర్వాణకు మరో అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘టక్ జగదీష్’ అనే చిత్రం రాబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చేసిన చిత్ర యూనిట్.. ప్రీ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఆ లుక్‌‌ను చూస్తుంటే.. శివ నిర్వాణ గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతోంది. #Nani26 is #TuckJagadish […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Dec 03, 2019 | 6:11 PM

నాచురల్ స్టార్ నాని తన నెక్ట్స్ మూవీని ప్రకటించేశాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో తన కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌ను ఇచ్చిన శివ నిర్వాణకు మరో అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘టక్ జగదీష్’ అనే చిత్రం రాబోతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చేసిన చిత్ర యూనిట్.. ప్రీ లుక్‌ను కూడా విడుదల చేసింది. ఆ లుక్‌‌ను చూస్తుంటే.. శివ నిర్వాణ గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతోంది.

ఇక ఈ మూవీలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటించబోతున్నారు. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించబోతున్నాడు. కాగా నాని, థమన్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. అయితే శివ నిర్వాణ ఇప్పటివరకు రెండు చిత్రాలను తెరకెక్కించగా.. అవి రెండు లవ్ ఫెయిల్యూర్ నేపథ్యంలో తెరకెక్కినవే. ఇక ఫీల్‌గుడ్ మూవీలుగా తెరకెక్కిన ఈ రెండు సినిమాలకు మలయాళ మ్యూజిక్ డైరక్టర్ గోపి సుందర్‌నే సంగీతం అందించాడు.

అయితే ‘మజిలీ’ సినిమా సమయంలో చిత్ర యూనిట్‌కు, సంగీత దర్శకుడు గోపి సుందర్‌కు అభిప్రాయబేధాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో అలిగిన గోపి సుందర్.. ‘మజిలీ’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వనని తెగేసి చెప్పాడని.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చేసేదేం లేక నిర్మాతలు థమన్‌తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయించుకున్నారని అప్పట్లో టాక్ బాగా వినిపించింది(కాగా మజిలీ సినిమా బ్యాక్‌గ్రౌండ్ విషయంలో థమన్ మెప్పించినా.. అదంతా ప్రియతమా, ప్రియతమా సాంగ్‌ హమ్మింగ్ మాత్రమే ఉంటుంది అది వేరే విషయం). అంతేకాదు ఈ విషయంలో నిర్మాతల మండలిలో గోపి సుందర్‌పై, మూవీ యూనిట్ ఫిర్యాదు చేసినట్లు కూడా పుకార్లు వినిపించాయి. ఇక తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఆ అభిప్రాయబేధాలు తొలిగినట్లు లేవు. అందుకే ఇప్పుడు నాని మూవీ కోసం శివ నిర్వాణ, థమన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా థమన్‌తో పోలిస్తే గోపి సుందర్‌ మెలోడీ పాటలు ఇవ్వడంలో దిట్ట. తెలుగులో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘మజ్ను’, ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’, ‘ఊపిరి’ వంటి ప్రేమ కథా చిత్రాలకు గుర్తుండిపోయే సంగీతాన్ని ఇచ్చాడు గోపి సుందర్. మరోవైపు నానికి కూడా హ్యాట్రిక్ హిట్లను ఇచ్చాడు ఈ సంగీత దర్శకుడు. ఇంకా చెప్పాలంటే ‘భలే భలే మగాడివోయ్’, ‘మజ్ను’ సినిమాలకు గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్‌ను మెచ్చే.. నాని, అతడిని శివ నిర్వాణకు పరిచయం చేసినట్లు కూడా టాక్ ఉంది. అయితే శివ నిర్వాణకు, గోపి సుందర్‌కు ‘మజిలీ’ సినిమా విషయంలో గొడవ రావడంతో.. నాని కూడా ‘టక్ జగదీష్‌’కు తన సెంటిమెంట్ మ్యూజిక్ డైరక్టర్‌ను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అసలు శివ నిర్వాణ, గోపి సుందర్‌ మధ్య ఏం జరిగింది..? వారిద్దరి కాంబోలో ఇకపై సినిమాలు రావా..? అన్న విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి. కాగా నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu