దిశ ఘటన: ’అర్జున్ రెడ్డి‘ డైరెక్టర్ పై ట్విట్ వార్

హైదరాబాద్‌ నగర శివారులో చోటు చేసుకున్న మహిళా డాక్టర్‌ అత్యాచారం, హత్య సంఘటనపై యావత్‌ భారతావని భగ్గుమంది. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పార్లమెంట్‌ సైతం పాశవిక ఘటనపై దద్దరిల్లింది. నిందితులను శిక్షించాలంటూ.. ఎంపీలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. సెలబ్రిటీల నుంచి సామాన్య జనం వరకూ మహిళల రక్షణపై ప్రభుత్వాలను నిలదీశారు. ఈ క్రమంలోనే దిశ సంఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ. సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే..దోషులను […]

దిశ ఘటన: ’అర్జున్ రెడ్డి‘ డైరెక్టర్ పై ట్విట్ వార్
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 03, 2019 | 7:22 PM

హైదరాబాద్‌ నగర శివారులో చోటు చేసుకున్న మహిళా డాక్టర్‌ అత్యాచారం, హత్య సంఘటనపై యావత్‌ భారతావని భగ్గుమంది. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పార్లమెంట్‌ సైతం పాశవిక ఘటనపై దద్దరిల్లింది. నిందితులను శిక్షించాలంటూ.. ఎంపీలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. సెలబ్రిటీల నుంచి సామాన్య జనం వరకూ మహిళల రక్షణపై ప్రభుత్వాలను నిలదీశారు. ఈ క్రమంలోనే దిశ సంఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ.

సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే..దోషులను కఠినంగా శిక్షించి..నేరస్తుల్లో వణుకు పుట్టించాలని డిమాండ్‌ చేశారు. నేరానికి పాల్పడే వాడిలో భయాన్ని కలిగించటం ఒక్కటే మార్గం అంటూ వంగ తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. దీంతో సందీప్‌ వంగ పెట్టిన పోస్టులపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అర్జున్‌రెడ్డి, దాని రీమేక్‌ కబీర్‌ సింగ్‌ సినిమాల్లో మహిళలపై హింసను చూపించి, పురుషాధిపత్యాన్ని, చెడు అలవాట్లను ప్రోత్సాహించేలా చూపించినా సందీప్‌ రెడ్డి కూడా నీతులు చెబుతున్నాడంటూ నెటిజన్లు ఎద్దేవా చేశారు. కొందరైతే ఏకంగా ఈ కేసులో మొదట సందీప్‌ వంగనే అరెస్ట్‌ చేయాలంటూ మండిపడ్డారు. జీవితంపై సరైన అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే సినిమాలను సినిమాగానే చూస్తారని, కానీ, కొందరు మాత్రం అదే ఫాషన్‌గా ఫాలో కావడంతోనే ఇటువంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయంటూ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.