దమ్ముంటే ‘జబర్దస్త్’ కి రండి ! ‘మల్లెమాల’ సవాల్ !

జబర్దస్త్‌ అంటే నవ్వుల హరివిల్లు… గత ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు ఆనందాల విందు పంచిన ఈ షో నుంచి ఊహించని రీతిలో నాగబాబు తప్పకోవడం అందరికీ షాకిచ్చింది. నాగబాబు లేని జబర్దస్త్‌పై అనేక కామెంట్స్‌ వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇక జబర్దస్త్ కళ తప్పినట్లే అని టాక్ కూడా వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయని జబర్దస్త్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం రోజా ఒక్కరితోనే షోను కంటిన్యూ చేస్తోంది. అయితే, నాగబాబు స్థానంలోకి వచ్చే కొత్త వారికి […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 4:54 pm, Tue, 3 December 19
దమ్ముంటే 'జబర్దస్త్' కి రండి ! 'మల్లెమాల' సవాల్ !
జబర్దస్త్‌ అంటే నవ్వుల హరివిల్లు… గత ఏడేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు ఆనందాల విందు పంచిన ఈ షో నుంచి ఊహించని రీతిలో నాగబాబు తప్పకోవడం అందరికీ షాకిచ్చింది. నాగబాబు లేని జబర్దస్త్‌పై అనేక కామెంట్స్‌ వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇక జబర్దస్త్ కళ తప్పినట్లే అని టాక్ కూడా వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయని జబర్దస్త్ మేనేజ్‌మెంట్ ప్రస్తుతం రోజా ఒక్కరితోనే షోను కంటిన్యూ చేస్తోంది. అయితే, నాగబాబు స్థానంలోకి వచ్చే కొత్త వారికి మల్లెమాల సంస్థ.. పలు రకాల కండిషన్స్‌ పెడుతోందట.
షో చేయడం కోసం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆసక్తిగా ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ షోకు జడ్జ్‌గా చేసేవాళ్లు వేరే ఏ షో చేయాలన్నా.. వేరే ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయాలన్నమల్లెమాల వాళ్లను సంప్రదించి కానీ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదట. ఇలాంటివే.. 7పేజీల అగ్రిమెంట్‌ను సైన్ చేయాలనే కండిషన్స్ పెడుతున్నారట. ఆ కండిషన్స్ చూసి చాలా మంది ఈ షోకు జడ్జ్‌గా చేయాలనుకునే వారు కాస్త  భయపడుతున్నట్లుగా సమాచారం.. అందుకే జడ్జ్‌గా చేయడానికి ముందు కొచ్చిన సెలబ్రిటీలు.. ఈ కండిషన్స్ చూసి వెనక్కి తగ్గుతున్నారట. మల్లెమాల వాళ్లు మాత్రం ఈ కండిషన్స్‌ను ఒప్పుకున్నవాళ్లనే జడ్జ్‌గా నియమించాలనే పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే..షో మొదలైనప్పటి నుంచి నాగబాబు, రోజా జడ్జ్‌లు గా ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. వీరి నవ్వులకు బాగా కనెక్ట్ అయ్యారు బుల్లితెర ప్రేక్షకులు.