ఆ ప్రసక్తే లేదంటున్న ‘ఉప్పెన’ టీమ్‌..!

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో షూటింగ్‌లను పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి.

ఆ ప్రసక్తే లేదంటున్న 'ఉప్పెన' టీమ్‌..!
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 4:06 PM

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో షూటింగ్‌లను పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఐదారు చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల కాగా.. లిస్ట్‌లో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. అయితే తెలుగులో మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. తమ సినిమాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు మొన్నటివరకు నిర్మాతలు ఆసక్తిని చూపలేదు. కాస్త నిదానమైనా థియేటర్లోనే వాటిని విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది ముందడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలో తెలుగులో ఇప్పటికే కృష్ణ అండ్ హిజ్‌ లీలలు, భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమాలు ఆన్‌లైన్‌లో విడుదలయ్యి మంచి టాక్‌ను సంపాదించుకున్నాయి. అంతేకాదు బాహుబలి నిర్మాతలు నిర్మించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రం కూడా త్వరలోనే ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. వీటితో పాటు నిశ్శబ్ధం, ఒరేయ్ బుజ్జిగా, రెడ్ చిత్రాలు కూడా ఆన్‌లైన్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్‌లో ఉప్పెన టీమ్‌ లేదట. ఎలాంటి పరిస్థితులోనైనా సరే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని మేకర్లు అంటున్నారట. అందుకే కొన్ని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలు ఆఫర్ ఇస్తున్నప్పటికీ, ఉప్పెన మేకర్లు మాత్రం నో అని చెప్పేస్తున్నారట.

కాగా ఈ సినిమా ద్వారా ముగ్గురు టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సన, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి ముగ్గురికి ఇది మొదటి చిత్రమే. అయినప్పటికీ స్టోరీ మీద ఉన్న నమ్మకంతో  దాదాపు 20కోట్లతో సినిమాను నిర్మించారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు ఇటీవల ఎడిటింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయట. ఆ ఔట్‌పుట్‌ని చూసిన టీమ్‌కి సినిమాపై నమ్మకం మరింత పెరిగిందట. అందుకే ఆన్‌లైన్‌లో రిలీజ్‌ ప్రసక్తే లేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆన్‌లైన్‌లో విడుదల లేకపోతే.. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది గానీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే టీజర్‌, రెండు పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Latest Articles
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
చిన్న వ్యాయామాలతో పెద్ద సమస్యకు చెక్‌.. అధ్యయనంలో తేలిన విషయాలు
ఈ పాపం కొవిషీల్డ్‌దేనా ..
ఈ పాపం కొవిషీల్డ్‌దేనా ..
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే