Karthikeya 2: బాక్సాఫీస్ ముందు దుమ్మురేపుతోన్న కార్తికేయ-2.. నిఖిల్ కెరీర్‌లోనే తొలి సినిమాగా..
Karthikeya 2: కార్తికేయ-2 సినిమా బాక్సాఫీస్ ముందు దుమ్మురేపుతోంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. విడుదలైన ఒక్కరోజే బ్రేక్ ఈవెన్‌కు చేరువైందీ సినిమా...
Karthikeya 2: కార్తికేయ-2 సినిమా బాక్సాఫీస్ ముందు దుమ్మురేపుతోంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. విడుదలైన ఒక్కరోజే బ్రేక్ ఈవెన్‌కు చేరువైందీ సినిమా. ఆగస్టు 13 (శనివారం) విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచి హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల గ్రాస్, రూ. 5.05 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఫస్ట్ డే రూ. 5.30 కోట్ల గ్రాస్, రూ. 3.50 కోట్ల షేర్‌ను రాబట్టింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించలేవనే వాదనలు వినిపిస్తున్నా ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టడం విశేషం. నిఖిల్ కెరీర్‌లోనే మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన సినిమాగా కార్తికేయ-2 నిలవడం విశేషం. ఏరియాల వారీగా చూస్తేలో నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్ -రూ.40 లక్షలు, ఈస్ట్ – రూ.33 లక్షలు, వెస్ట్ – రూ.20 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 45 లక్షలు, గుంటూరు- రూ.44 లక్షలు, కృష్ణా – రూ.27 లక్షలు, నెల్లూరు – రూ.17 లక్షలు రాబట్టింది.
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమాలో నిఖిల్‌కు జోడిగా అనుపమ నటించిన విషయం తెలిసిందే. ద్వారక, శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..