O2 Movie Trailer: ‘ఆక్సిజన్‌ కోసం ప్రాణాలు తీసే పరిస్థితి వస్తే’.. ఆసక్తికరంగా నయన్‌ ‘O2’ ట్రైలర్‌..

O2 Movie Trailer: లేడి ఓరియెంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరు నయనతార (Nayanatara). కెరీర్‌ తొలినాళ్ల నుంచి హీరోయిన్‌ ప్రాధాన్యత పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోన్న నయనతార తాజాగా, మరో మూవీతో ప్రేక్షకులకు...

O2 Movie Trailer: 'ఆక్సిజన్‌ కోసం ప్రాణాలు తీసే పరిస్థితి వస్తే'.. ఆసక్తికరంగా నయన్‌ 'O2' ట్రైలర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 07, 2022 | 7:47 AM

O2 Movie Trailer: లేడి ఓరియెంటెడ్‌ సినిమాలకు పెట్టింది పేరు నయనతార (Nayanatara). కెరీర్‌ తొలినాళ్ల నుంచి హీరోయిన్‌ ప్రాధాన్యత పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోన్న నయనతార తాజాగా, మరో మూవీతో ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ‘O2’ (ఆక్సిజన్‌) పేరుతో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి బజ్‌ వచ్చింది.

ఇక విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతోన్న తన కొడుకును నయనతార ఎలా కాపాడుకుందనేదే సినిమా కథాంశం. నయనతార తన కొడుకుతో కలిసి ప్రయాణం చేస్తున్న బస్సు అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆక్సిజన్‌ లభించని చోట బస్సు చిక్కుకుపోవడంతో బస్సులో ఉన్నవారంతా ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతుంటారు.

ఈ సమయంలో ఆక్సిజన్‌ కోసం బస్సులోని వారు ఒకరి ప్రాణాలు మరొకరి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆక్సిజన్‌ కోసం దాడి చేయాలని చూస్తున్న వారి నుంచి తన కొడుకును నయన తార ఎలా కాపాడుకుంది.? ఆ బస్సులో ఉన్న వారంతా ఎలా బయటపడ్డారన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ‘O2’ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?