ఆ సినిమాలో అందరూ ‘ఫ్రీ’గా నటించారట

నటిగా మంచి గుర్తింపును సాధించిన నందితా దాస్‌, దర్శకురాలిగానూ పలు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 10:30 pm, Sat, 5 September 20
ఆ సినిమాలో అందరూ 'ఫ్రీ'గా నటించారట

Nandita Das Manto movie: నటిగా మంచి గుర్తింపును సాధించిన నందితా దాస్‌, దర్శకురాలిగానూ పలు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందులో ‘మాంటో’ చిత్రం ఒకటి. ప్రముఖ ఉర్దూ రచయిత సాదత్‌ హాసన్ మాంటో జీవిత కథ ఆధారంగా నందితా దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ ప్రధాన పాత్రలో నటించారు. రిషి కపూర్‌, రన్‌వీర్ షోరే, జావేద్ అక్తర్‌, పరేష్‌ రావల్‌, దివ్యా దత్త కీలక పాత్రల్లో నటించారు. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాదు కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ఈ సినిమాను ప్రదర్శించారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని నందితా దాస్ ఇటీవల వెల్లడించారు. అదేంటంటే ఇందులో నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ ఈ మూవీ కోసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్‌ను తీసుకున్నారట. ఇక రిషి కపూర్, పరేష్‌ రావల్, రణ్‌వీర్ షోరే, దివ్య దత్తా, జావేద్ అక్తర్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా నటించారట. వారందరూ డబ్బుకు విలువ ఇవ్వలేదని, మంచి స్క్రిప్ట్‌కు విలువ ఇచ్చారని నందితా దాస్ తెలిపారు.

Read more:

ఈ నెల 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ

సుశాంత్ కేసు: మరొకరిని అరెస్ట్‌ చేసిన ఎన్సీబీ