AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా హీరో కోసం న్యాచురల్ స్టార్

హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీస్ కోసం న్యాచురల్ స్టార్ నాని గెస్ట్‌గా రాబోతున్నారు. శిరీస్ నటించిన రీసెంట్ మూవీ ‘ఏబీసీడీ’.  అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అనేది మూవీ ట్యాగ్ లైన్.  శిరీష్‌ సరసన  ‘రుక్సార్‌’ ఆడిపాడబోతుంది. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌గా దీన్ని […]

మెగా హీరో కోసం న్యాచురల్ స్టార్
Ravi Kiran
|

Updated on: May 11, 2019 | 4:57 PM

Share

హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీస్ కోసం న్యాచురల్ స్టార్ నాని గెస్ట్‌గా రాబోతున్నారు. శిరీస్ నటించిన రీసెంట్ మూవీ ‘ఏబీసీడీ’.  అమెరికన్‌ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ’ అనేది మూవీ ట్యాగ్ లైన్.  శిరీష్‌ సరసన  ‘రుక్సార్‌’ ఆడిపాడబోతుంది. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. నాగబాబు, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు నాని హాజరు కాబోతున్నారట. ఈ విషయాన్ని శిరీష్‌ ట్విటర్‌ వేదికగా తెలుపుతూ.. అతిథిగా రావడానికి ఒప్పుకున్న నేచురల్‌ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పారు. మే 13న సాయంత్రం 7 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వేడుక ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

Follow Us