నాని సినిమాకు పెరిగిన బడ్జెట్‌..!

ఓ వైపు కమర్షియల్ చిత్రాలు తీస్తూనే మరోవైపు వైవిధ్య కథల్లోనూ నటిస్తుంటారు నాచురల్ స్టార్ నాని. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో

నాని సినిమాకు పెరిగిన బడ్జెట్‌..!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 11:26 AM

Nani movie budget: ఓ వైపు కమర్షియల్ చిత్రాలు తీస్తూనే మరోవైపు వైవిధ్య కథల్లోనూ నటిస్తుంటారు నాచురల్ స్టార్ నాని. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’‌ అనే చిత్రంలో నటిస్తున్నారు నాని. ఈ మూవీ తరువాత రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే మూవీలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఇక కథానుగుణంగా కోల్‌కతా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందట. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి ఈ సినిమా షూటింగ్‌ని చేయాలనుకున్నారట మేకర్లు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే సెట్ వేయడం మంచిదన్న ఆలోచనకు వచ్చారట. దీంతో మూవీ బడ్జెట్‌ని నిర్మాతలు పెంచినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ సినిమా కోసం ఖర్చును పెంచేందుకు మేకర్లు వెనకడగు వేయాలనుకోవడం లేదట. ఈ కథ చాలా బావుండటం, దర్శకుడిపై నమ్మకంతో వారు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదని సమాచారం. కాగా ఇందులో నెగిటివ్ ఛాయలున్న ఓ పాత్ర కోసం సాయి పల్లవిని ఎంచుకున్నట్లు టాక్.

Read more:

ఆర్మీ మేజర్‌గా విజయ్ దేవరకొండ..!

ఆ నిర్ణయంతో చంద్రబాబులో వణుకు మొదలైంది: సుబ్రహ్మణ్య స్వామి