సీనియర్ హీరోలకు ఆప్షన్ లేదు.. ఇంకా వారే దిక్కు
సీనియర్ తెలుగు హీరోలకు జోడీగా నటించడానికి హీరోయిన్ల కొరత తీవ్రంగా మారింది. వయసులో చాలా చిన్నవారైన నటీమణులతో తెర పంచుకోవడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోయింది. చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ వంటి తారలు యువ హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీ పండిస్తున్నా, ఈ ధోరణి కొన్నిసార్లు విమర్శలకు దారితీస్తోంది. పరిశ్రమలో దీర్ఘకాలం నిలిచే హీరోయిన్లు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.
సీనియర్ హీరోలతో సినిమాల కోసం కథలు రాయడం ఈజీనే కానీ వాళ్లకు జోడీ వెతకడం మాత్రం దర్శకులకు తలకు మించిన భారమే. తప్పక తమకంటే వయసులో సగం ఉన్న వాళ్లతోనే నటిస్తున్నారు హీరోలు. కొన్నిసార్లు విమర్శలు వస్తున్నా.. ఆప్షన్ లేకుండా పోతుంది వాళ్లకు. తాజాగా అలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓసారి వాళ్లపై లుక్ వేద్దామా..? 60 ప్లస్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టమే. కానీ కుర్ర హీరోయిన్లతోనూ అదిరిపోయే కెమిస్ట్రీ పండిస్తున్నారు సీనియర్లు. కావాలంటే రవితేజనే తీసుకోండి.. మొన్న మాస్ జాతరలో శ్రీలీలతో రెండోసారి జోడీ కట్టిన మాస్ రాజా.. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో ఇటు ఆషికా రంగనాథ్, అటు డింపుల్ హయాతీతో జోడీ కట్టారు. ఇద్దరితోనూ కెమిస్ట్రీ ఫిజిక్స్ అదిరిపోయేలా పండించారు. బాలయ్య సైతం కొన్నేళ్లుగా యంగ్ బ్యూటీస్‌తోనే జోడీ కడుతున్నారు. డాకూ మహరాజ్‌లో అఖండ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్‌తో పాటు ఊర్వశి రౌతెలా లాంటి హీరోయిన్లతో నటించిన బాలయ్య.. అఖండ 2లో ఓ పాటలో సంయుక్త మీనన్‌తో చిందేసారు. ఇక చిరంజీవికి హీరోయిన్ల కష్టాలు తప్పట్లేదు. అందుకే ఆయన నయనతార, త్రిష అంటూ సీనియర్లతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారులో నయనతో మూడోసారినటిస్తున్నారు.. అలాగే విశ్వంభరలో త్రిష నటిస్తున్నారు. వీళ్లు సీనియర్లే అయినా.. వయసులో చిరు కంటే చాలా చిన్నోళ్లు. బాలయ్య సైతం గోపీచంద్ మలినేని సినిమాలో నయనతోనే నటించబోతున్నారు. ఒకప్పట్లా లాంగ్ రన్ ఉన్న హీరోయిన్లు లేకపోవడంతో.. సీనియర్ హీరోలకు మరో ఆప్షన్ లేకుండా పోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటున్న కుర్ర హీరోలు..
2 వారాలు.. 12 సినిమాలు.. దండయాత్రే
బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..
ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్
తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

