బిగ్‌బాస్ టైటిల్ నాదే నాన్నా.. భరణికి లీకిచ్చిన తనూజ..
బిగ్ బాస్ హౌస్ నుండి భరణి శంకర్ ఊహించని రీతిలో ఎలిమినేట్ అయ్యారు. ఈ పరిణామంపై తనూజ మిశ్రమ స్పందన చూపింది. భరణి వీడ్కోలు పలికేటప్పుడు, తనూజ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానని చెప్పడం, దానికి నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేయడం విశేషం. ఈ ఎలిమినేషన్, విన్నర్ ప్రిడిక్షన్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఎవ్వరు ఊహించని విధంగా టాప్ 5కి వెళ్లకుండానే భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్‌లో నాన్న నాన్న అంటూ భరణి వెనకాలే తిరిగే తనూజ… ఈ సారి కాస్త మిక్స్‌డ్ ఎమోషన్స్‌ను చూపించింది. అంతేకాదు తన సీరియల్ ఎక్స్‌పీరియన్స్‌తో… చివర్లో భరణి కాళ్లు మొక్కి బయట ఉన్న జనాల్లో మరిన్ని మంచి మార్కులు కొట్టేందుకు గట్టిగా నే ప్రయత్నించింది. ఇక హౌస్ నుంచి బయటికి వెళుతూ భరణి కూడా తనూజకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ‘నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి.. నేనూ టాప్ 5లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5కి అర్హులే. మీ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పిన ఆయన.. తనూజ మాత్రం విన్నర్ అవ్వాలని స్పష్టంగా కోరకున్నాడు. నీ ఫ్యూచర్ బాగుండాలి అని ఆశీర్వదించాడు. అందుకు తనూజ ‘మీరు అనుకున్నది సాధించే బయటకి వస్తాను. మీకు, మా నాన్నకి కూడా అదే చెప్తున్నా అంటూ ఓ ఫైనల్ డైలాగ్ విసిరింది. అయితే దీన్ని పట్టుకున్న కొంత మంది నెటిజన్లు… బిగ్ బాస్ టైటిల్ తనూజదే కావచ్చని అందుకు భరణికి అలా చెప్పేసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. షరా మాములాగే మళ్లీ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫైనల్ ఓటింగ్.. ఎవ్వరికీ అందకుండా దూసుకుపోతున్న కళ్యాణ్
తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్
Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

