ఆర్మీ మేజర్‌గా విజయ్ దేవరకొండ..!

ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో

ఆర్మీ మేజర్‌గా విజయ్ దేవరకొండ..!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 11:10 AM

Vijay Deverakonda news: ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. తన అన్ని చిత్రాల లాగానే ఈ మూవీని మెర్చ్యూర్ లవ్‌ స్టోరీగా శివ నిర్వాణ తెరకెక్కంచనున్నారట. ఇక ఇందులో విజయ్‌ని మరో కొత్త అవతారంలో శివ చూపించబోతున్నారట. ఆర్మీ మేజర్‌గా విజయ్‌ని శివ చూపించబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫైటర్ తరువాత ఆర్మీ పాత్ర కోసం విజయ్ దేవరకొండ మళ్లీ వర్కౌట్లు చేయబోతున్నట్లు టాక్.

కాగా ప్రస్తుతం శివ నిర్వాణ, నానితో టక్ జగదీష్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటించనున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఫైటర్‌లో విజయ్ దేవరకొండ, బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆయన సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్నారు. తెలుగు, హిందీలో రాబోతున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more:

ఆ నిర్ణయంతో చంద్రబాబులో వణుకు మొదలైంది: సుబ్రహ్మణ్య స్వామి

ఐఐటీ, ఎన్ఐటీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఆ నిబంధన సడలింపు

Latest Articles